- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రూ.6 కోట్ల నగదుపై స్పందించిన మాజీ ఎంపీ వినోద్ కుమార్
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వేటు నుంచి తప్పించుకోలేరని మాజీ ఎంపీ బీ.వినోద్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం తెలంగాణ భవన్‌లో వినోద్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో లాగా స్పీకర్ మా అనర్హత పిటిషన్‌పై జాప్యం చేసే పరిస్థితి సుప్రీంకోర్టు ఇటీవలి తీర్పుతో పోయిందన్నారు. శివసేనను వీడిన ఏక్ నాథ్ షిండే గ్రూప్ ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు మూడునెలల్లో నిర్ణయం తీసుకోవాలని మహారాష్ట్ర స్పీకరును ఆదేశించిందని గుర్తుచేశారు. స్పీకర్‌కు కోర్టులు కాలపరిమితి విధిస్తున్నందున అనర్హత పిటిషన్‌పై ఇక వాయిదాలు కుదరవు అన్నారు. నాగేందర్ కాంగ్రెస్ కండువా కప్పుకున్న నుంచే ఆయన శాసన సభా సభ్యత్వం రద్దయినట్టే లెక్క అని కీలక వ్యాఖ్యలు చేశారు. స్పీకర్ తొందరగా నిర్ణయం తీసుకుని రాజ్యాంగాన్ని గౌరవించాలని కోరారు.
ఫిరాయింపుల నిరోధక చట్టం కాంగ్రెస్ దివంగత నేత రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నపుడే 1985లో రూపొందించారని తెలిపారు. రాజీవ్ గాంధీ మీద ఏమాత్రం గౌరవం ఉన్నా కాంగ్రెస్ నేతలు ఫిరాయింపులు ప్రోత్సహించకూడదని హితవు పలికారు. ఫిరాయింపులు ఎవరికీ మంచివి కాదని.. బీఆర్ఎస్ స్వల్ప తేడాతోనే అధికారానికి దూరమయ్యిందని అన్నారు. ప్రతిపక్షంలో ఉండటం కూడా మంచిదే అని అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ ఉద్యమ కారులే అన్నారు. ప్రతిమ మల్టీఫ్లెక్స్‌లో దొరికిన డబ్బులకు వాళ్ళే లెక్కలు చెప్పుకుంటారని వెల్లడించారు. వాళ్ళు నాకు బంధువులు అయినంత మాత్రానా నా మీద నిరాధార ఆరోపణలు చేస్తారా? అని మండిపడ్డారు.