- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బీజేపీ గ్రాఫ్ను దెబ్బ తీసేందుకు కుట్ర.. మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ ను దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతోందని, కాంగ్రెస్, బీఆర్ఎస్ అదే పనిగా డ్యామేజ్ చేయాలని చూస్తున్నాయని మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు అన్నారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎం కేసీఆర్ ఇద్దరి డీఎన్ఏ ఒక్కటేనని, బీజేపీని ఎదగకుండా చేస్తున్నారని ఆయన ఫైరయ్యారు. బీజేపీకి ప్రజల్లో ఉన్న ఆదరణను తగ్గించేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి కుట్ర చేస్తూ మీడియాలో కథనాలు రాయిస్తున్నాయని ధ్వజమెత్తారు.
లిక్కర్ స్కాం, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగితే రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనని ఆయన కొనియాడారు. బండి సంజయ్ ఆధ్వర్యంలో బీజేపీ గ్రాఫ్ పెరిగిందని, అది తట్టుకోలేక దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ కు ఏకైక ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనని చెప్పారు. కర్నాటక ఎన్నికలతో కాంగ్రెస్ కు ఆక్సిజన్ వచ్చినట్లు భావిస్తున్నారని, కానీ కర్నాటక ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేక అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం ఉందన్నారు.