‘బండి సంజయ్‌ను అడ్డుకోవడం కేసీఆర్ వల్ల కాదు’

by GSrikanth |
‘బండి సంజయ్‌ను అడ్డుకోవడం కేసీఆర్ వల్ల కాదు’
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీలను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ సీనియర్ నేత, పటాన్ చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ ఘాటు విమర్శలు చేశారు. హైదరాబాద్‌లో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. బీసీలను అణిచివేయాలని కేసీఆర్ చూస్తున్నారని, వారిని ఎదగినివ్వకుండా అడ్డుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు. బీజేపీ పార్టీ బీసీ వ్యక్తిని ప్రధానిని చేస్తే దళిత వ్యక్తిని సీఎంగా చేస్తనని మోసం చేసిన వ్యక్తి అని ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీలు విస్మరించడమే కాకుండా అత్యధిక జనాభా కలిగిన బీసీలకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందించకుండా కేసీఆర్ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని ఆయన ధ్వజమెత్తారు. కేవలం గొర్లు, బర్లు ఇచ్చి విద్యకు దూరం చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కు దక్కిందని నందీశ్వర్ గౌడ్ ఎద్దేవాచేశారు. ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్ ఇవ్వడంలోనూ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని, దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ధ్వజమెత్తారు.

మొన్నటికి మొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై లేని పోని ఆరోపణలతో జైలుకు పంపించడంపై నందీశ్వర్ గౌడ్ తీవ్రంగా ఫైరయ్యారు. తెలంగాణలో బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నయం బీజేపీయేనని అర్థమయ్యే బీజేపీ స్పీడ్‌కు బ్రేకులు వేయాలని నీచ రాజకీయాలకు దిగజారారని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ తన ప్రతిష్టను తానే రోజురోజుకూ దిగజార్చుకుంటున్నారని చురకలంటించారు. బండి సంజయ్‌ని నీచ రాజకీయాలు చేసి జైల్లో వేసినా చివరకు న్యాయమే గెలిచందని ఆయన వెల్లడించారు. బీజేపీని, బండి సంజయ్‌ని నేరుగా ఎదుర్కొనే దమ్ములేక చేతకాని దద్దమ్మల్లాగా లేని పోని కారణాలతో ఇరికించారని ఆయన ధ్వజమెత్తారు. బండికి బెయిల్ రావడం అధర్మంపై నెగ్గిన ధర్మంగా ఆయన చెప్పుకొచ్చారు. డైవర్ట్ పాలిటిక్స్ చేసి ఎంత అణిచివేయాలని చూసినా బండిని అడ్డుకోలేరని ఆయన స్పష్టంచేశారు. ఆఖరుకు బండి బెయిల్ పై విడులయ్యాక భారీ ర్యాలీగా వెళ్తారనే కరీంనగర్ లో 144 సెక్షన్ విధించారని, ఇది కేసీఆర్ కుటిల బుద్ధికి నిదర్శనంగా నందీశ్వర్ గౌడ్ పేర్కొన్నారు.

Advertisement

Next Story