- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
CM రేవంత్ తలకిందులుగా తపస్సు చేసిన ఆ పని జరగదు: హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం భద్రాచలంలో బీఆర్ఎస్ కార్యకర్తలతో హరీష్ రావు పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రాకపోతే రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యేవారే కాదని.. పీసీసీ చీఫ్ కాకపోతే ఆయన సీఎం అయ్యేవారే కాదన్నారు. ముఖ్యమంత్రి పదవి రేవంత్ రెడ్డికి కేసీఆర్ పెట్టిన భిక్ష అని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ ప్రధాని కావాలన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు సైతం హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి తలకిందులుగా తపస్సు చేసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత దేశ ప్రధాని కాలేరని జోస్యం చెప్పారు.
బీజేపీతో కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కైందని ఆరోపించారు. బీజేపీకి కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయం కాదని.. బీఆర్ఎస్ పార్టీ మాత్రమే బీజేపీని ఢీకొట్టగలదని అన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ బీజేపీ కీలక నేతలందరిని ఓడించింది బీఆర్ఎస్ పార్టీనే అని హరీష్ రావు గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ అప్పులపై మాట్లాడుతోన్న కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చి రెండు నెలల కాకముందే రూ.14 వేల కోట్ల అప్పులు చేశారని ఆరోపించారు. తెలంగాణవాదం ఢిల్లీలో వినిపించాలంటే పార్లమెంట్‌లో బీఆర్ఎస్ ఎంపీలు ఉండాలని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను మెజార్టీ సీట్లలో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.