- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేరాలు ప్రూవ్ చేయాలంటే ఫోరెన్సిక్ ఆధారాలే కీలకం: డీజీ షిఖా గోయెల్
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: నేరాలకు పాల్పడే నిందితులకు శిక్షలు పడటంలో ఆధారాలు కీలకపాత్ర వహిస్తాయని షీ టీమ్స్, భరోసా అదనపు డీజీపీ షిఖా గోయెల్ అన్నారు. మెడికో లీగల్కేసుల్లో సమగ్రమైన ఫోరెన్సిక్ఆధారాలను సేకరించి న్యాయస్థానాలకు అందచేస్తే నిందితులు తప్పించుకోవటానికి అవకాశాలు తక్కువగా ఉంటాయని చెప్పారు. రాష్ర్ట వ్యాప్తంగా వేర్వేరు ఆస్పత్రుల్లో విధులు నిర్వర్తిస్తున్న ఎనభై అయిదు మంది వైద్యులకు ఉమెన్సేఫ్టీ వింగ్కార్యాలయంలో ఫోరెన్సిక్ఆధారాలు సేకరించే అంశంపై నిర్వహించిన రెండు రోజుల వర్క్షాప్ముగిసిన నేపథ్యంలో అదనపు డీజీపీ షిఖా గోయెల్మాట్లాడారు.
ఆధారాలను సేకరించటమే కాదు వాటిని భద్రపరచటంలో కూడా అత్యంత కీలకమని చెప్పారు. ముఖ్యంగా అత్యాచారాలు, మైనర్లపై జరిగే లైంగిక వేధింపుల కేసుల్లో ఈ ఆధారాలు నిందితులకు శిక్షలు పడేలా చూడటంలో ప్రధానపాత్ర పోషిస్తాయన్నారు. శిక్షలు పడినప్పుడే బాధితులకు న్యాయం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పెట్లబుర్జూ ఆస్పత్రి సూపరిండింటెంట్డాక్టర్మాలతీ పొన్నూర్‌తో పాటు ఉమెన్సేఫ్టీ వింగ్అదనపు సూపరిండింటెంట్డాక్టర్పీ.అశోక్, ఫోరెన్సిక్ఎక్స్పర్ట్డాక్టర్సుధ, భరోసా టెక్నికల్డైరెక్టర్మమతా రఘువీర్ తదితరులు పాల్గొన్నారు.