ఇళ్ల స్ధలాల క్రమబద్దీకరణపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం

by Satheesh |   ( Updated:2023-05-01 13:53:04.0  )
ఇళ్ల స్ధలాల క్రమబద్దీకరణపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ గడువును మరో నెలరోజులు పొడగిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల పరిధిలోని మున్సిపాలిటీల పరిధిల్లో ఉన్న పేదల ఇండ్ల నిర్మాణం కోసం ఇబ్బందులు లేకుండా, నిబంధనల మేరకు వారి ఇంటి స్థలాలను క్రమబద్ధీకరించి, వారికి న్యాయపరమైన హక్కులను కల్పిస్తామని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి నోటరీ స్థలాలను జీవో 58, 59‌ల ప్రకారం క్రమబద్ధీకరించుకోవాలని ప్రజలకు సూచించారు. ఏకకాలంలో ఒకే మొత్తంలో పేదల ఇండ్ల సమస్యలు పరిష్కారం కావాలనేది ప్రభుత్వ ఉద్దేశ్యమని, ఇందుకు సంబంధించిన ప్రత్యేక డ్రైవ్ ను నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

సచివాలయంలో సోమవారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలను కోరారు. తక్షణమే తమ తమ నియోజకవర్గాల పరిధిల్లోని ఎమ్మెల్యేలను కలిసి తమకున్న నోటరీ తదితర ఇండ్ల స్థలాల రెగ్యులేషన్ సమస్యలను తెలుపుకోవాలన్నారు. అన్ని సమస్యలను క్రోడీకరించి, పరిష్కరించి, వారికి న్యాయపరమైన హక్కులతో కూడిన పట్టాలను ప్రభుత్వం అందజేస్తుందని వెల్లడించారు. వ్యవసాయ భూముల నోటరీ సమస్యలను కూడా పరిష్కరిస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు.

త్వరలోనే ఇందుకు సంబంధించి కలెక్టర్ల కాన్ఫరెన్సు నిర్వహించనున్నామన్నారు. ఈ సమావేశంలో మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు శేరి సుభాష్ రెడ్డి, నవీన్ కుమార్, ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, మాగంటి గోపినాథ్, దానం నాగేందర్, మాధవరం కృష్ణారావు, జాజుల సురేందర్, ఆత్రం సక్కు, ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్ రావు, సీఎం కార్యదర్శి స్మితా సభర్వాల్, నవీన్ మిట్టల్, ప్రియాంకవర్గీస్ తదితరులు పాల్గొన్నారు.

Read more:

రిజర్వాయర్లు నింపండి.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ సమీక్షా సమావేశంలో సీఎం

బిగ్ బ్రేకింగ్: మే డే రోజున కార్మికులకు CM కేసీఆర్ భారీ గుడ్ న్యూస్

Advertisement

Next Story