- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Seethakka: విద్య, అభివృద్ధిలో నేటికీ అంతరాలు: మంత్రి సీతక్క

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: విద్య, అభివృద్ధిలో నేటికీ అంతరాలు కొనసాగుతున్నాయని ఆ అంతరాలను తొలగించే దిశలో అంతా కలిసికట్టుగా పని చేయాల్సిన అవసరం ఉందని మంత్రి సీతక్క (Seethakka) అన్నారు. మారిన పరిస్థితుల్లో మానవ సంబంధాలు బలహీనపడుతున్నందునా మానవ విలువలను, సంబంధాలను పటిష్టం చేసే విద్యను ప్రోత్సహించాలన్నారు. బుధవారం విద్యాధన్ ఫౌండేషన్ (Vidya Dhan Foundation) నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడిన సీతక్క.. జీవితంలో అన్నిటికన్నా ఉత్తమమైనది విద్య అన్నారు. విద్యతోనే వికాసం సాధ్యపడుతుందని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం విద్యా హక్కు చట్టం తెచ్చి 6-14 సంవత్సరాల మధ్య పిల్లలకు నిర్బంధ విద్యను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. విద్య పంచుకుంటేనే విజ్ఞానం పెరుగుతుందనే ఉద్దేశంతో విద్య ధన్ ఫౌండేషన్ పనిచేయడం అభినందనీయం అని పేదలకు విద్య అందించే విద్యాధన్ ఫౌండేషన్ రు మా ప్రభుత్వ సహకారం ఎల్లవేళలా ఉంటుందన్నారు.
అజ్ఞాతం తర్వాత చదువు కొనసాగిస్తున్నా..
విద్య ద్వారానే నా లైఫ్ ఈ స్థాయికి వచ్చిందని సీతక్క చెప్పారు. తాను టెన్త్ క్లాస్ వరకు చదువుకున్నాని ఆ తర్వాత పదేళ్లపాటు అజ్ఞాత జీవితం గడిపాననన్నారు. బయటకొచ్చిన తర్వాత తిరిగి విద్యార్థిగా చదువును కొనసాగించానని చదువుకోవాలి అన్న పట్టుదలతో ఎల్.ఎల్.బి, ఎల్.ఎల్.ఎం, ఎం.ఏ. పీ.హెచ్ డీ పూర్తిచేశానన్నారు. ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నా విద్యను ఆపలేదు. ఈ విద్యా సంవత్సరంలో కూడా ఎంఏ కోర్సును జాయిన్ అవ్వాలనుకుంటున్నాననని చెప్పారు. అన్ని దానాల్లోకెల్లా విద్యా దానం గొప్పది, జ్ఞానాన్ని లక్షల మందికి పెంచడం ద్వారా సమాజ అభివృద్ధికి కృషి చేసిన వాళ్లమవుతామన్నారు.