- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అసెంబ్లీ నుంచి ఈటల రాజేందర్ సస్పెండ్
దిశ, తెలంగాణ బ్యూరో : బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను శాసనసభ ప్రస్తుత సమావేశాల నుంచి సస్పెండ్ అయ్యారు. ఈ సమావేశాల ప్రారంభం రోజున (సెప్టెంబరు 6) స్పీకర్ ను ఉద్దేశిస్తూ మర మనిషిలా వ్యవహరించొద్దు అని చేసిన కామెంట్లకు స్పందనగా ఈ చర్యకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. శాసనసభ సమావేశాలు మంగళవారం ఉదయం ప్రారంభం కాగానే శాసన వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జోక్యం చేసుకుని స్పీకర్ పై ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని, సభలో క్షమాపణ చెప్పాలని ప్రతిపాదించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా ఇదే డిమాండ్ కు పట్టుబట్టారు. స్పీకర్ సైతం సభ మూడ్ ను దృష్టిలో పెట్టుకుని సహకరించాలని సూచించారు. మంత్రి, స్పీకర్ పదేపదే ఈటల రాజేందర్ పై ఒత్తిడి తీసుకొచ్చారు.
చివరకు శాసనసభా నిబంధనావళికి అనుగుణంగా 8వ సెషన్ మూడవ సమావేశం ముగిసేంత వరకు సభకు హాజరుకాకుండా సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. సభ నుంచి వెళ్ళిపోవాల్సిందిగా ఆదేశించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెలిచినప్పటి నుంచి సభా కార్యకలాపాల్లో ఆయన పాల్గొనడానికి అవకాశమే దొరకడంలేదు. ప్రతీ సమావేశాల్లోనూ వేర్వేరు కారణాలతో స్పీకర్ సస్పెన్షన్ వేటు వేస్తూనే ఉన్నారు.
Also Read : అసెంబ్లీ నుంచి ఈటల సస్పెన్షన్.. బండి సంజయ్ రియాక్షన్ ఇదే (వీడియో)
Also Read : మునుగోడులో బీజేపీ సీక్రెట్ ఆపరేషన్.. రహస్యంగా నేతల కదలికలు