టికెట్‌పై డౌట్స్.. ‘మొదటి పాఠం ఇదే అంటూ’ చెన్నమనేని భావోద్వేగ ట్వీట్!

by Sathputhe Rajesh |   ( Updated:2023-08-21 06:03:29.0  )
టికెట్‌పై డౌట్స్.. ‘మొదటి పాఠం ఇదే అంటూ’ చెన్నమనేని భావోద్వేగ ట్వీట్!
X

దిశ, వెబ్‌డెస్క్: కాసేపట్లో బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను విడుదల చేయనుంది. టికెట్ దక్కదని ప్రచారం జరుగుతున్న పది మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని ఉన్నారు. ఈ నేపథ్యంలో చెన్నమనేని భావోద్వేగ ట్వీట్ చేశారు. ‘రాజకీయాలు ప్రజల కోసమే చేయాలి, పదవులు కోసం కాదు అని చెప్పిన తండ్రి గారి మాటలను ప్రతిసారి స్మరించుకుంటూ ఆ పనిని నా తుది శ్వాస ఉన్నంతవరకు చేస్తానని నాతో ఉన్నవారందరికీ భరోసా ఇస్తున్నాను! దయచేసి నిర్ణయాలు అందరితో సంప్రదించి మా ప్రజాభిప్రాయానికి అనుగుణంగా తీసుకోవాలి, లేని పక్షంలో ఆత్మాభిమానాలు దెబ్బతింటాయి. ప్రజల ఆమోదం లభించదు. ఇది మనందరం తెలంగాణ ఉద్యమంలో నేర్చుకున్న మొదటి పాఠం’ అని ట్వీట్‌లో రాసుకొచ్చారు. అయితే కాసేపట్లో చెన్నమనేని టికెట్ విషయంలో క్లారిటీ రానుంది. టికెట్ రాని పక్షంలో చెన్నమనేని తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Read More :

కవిత ఇంటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల క్యూ

టికెట్ రాదని తెలిసి హుటాహుటిన ఆమె వద్దకు రేఖా నాయక్!

Advertisement

Next Story

Most Viewed