Manda KrishnaMadiga : మత విద్వేషాలను రెచ్చగొట్టే వారి ఉచ్చులో పడొద్దు : మంద కృష్ణమాదిగ

by M.Rajitha |   ( Updated:2025-02-27 14:44:52.0  )
Manda KrishnaMadiga : మత విద్వేషాలను రెచ్చగొట్టే వారి ఉచ్చులో పడొద్దు : మంద కృష్ణమాదిగ
X

దిశ, వెబ్ డెస్క్ : మత విద్వేషాలు వైషమ్యాలు రెచ్చ గొట్టే వాళ్ళ ఉచ్చులో పడకుండా అప్రమత్తంగా ఉండాలని భారత పౌరులుగా సమైక్యతకు పాటుపడుతున్న ముస్లిం లను కొన్ని రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుని వదిలేస్తున్నాయని మంద కృష్ణమాదిగ(Manda KrishnaMadiga) అన్నారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన బీఎంఆర్పీఎఫ్(BRMPF) ఆవిర్భావ సభలో మంద కృష్ణమాదిగ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.ముస్లింలకు రాజకీయభాగస్వామ్యం కల్పించాలన్నారు. దేశంలో మైనార్టీల జీవితాల్లో వెలుగులు నిండాలి అంటే పేదరికం పోవాలని మైనార్టీలు దయనీయస్థితిలో ఉండటానికి కారకులు ఎవరో గుర్తించి వాస్తవాలు గ్రహించడం ద్వారా భవిష్యత్ లో చైతన్యం చాటాలని మంద కృష్ణమాదిగ మైనార్టీలకు పిలుపునిచ్చారు. ప్రతీ కారం పెంచు కోవడం ద్వారా సాధించేది శూన్యం అని అదే పరివర్తనకు ప్రయత్నిస్తే ఏదైనా సాధించవచ్చని మందకృష్ణమాదిగ అన్నారు.

మైనార్టీల కు విద్య,ఉద్యోగం, రంగం తో పాటు రాజకీయ రంగంలో రిజర్వేషన్ల కోటా పెంచాలని, జీవన ప్రమాణాల్లో మెరుగుదల కోసం మైనార్టీలకు ప్రభుత్వాల నుంచి తోడ్పాటు ఇవ్వాలని కోరారు. ఇప్పటికైనా ముస్లిం మైనార్టీలు తమ స్వంతత్ర ఎజెండాతో వెళ్లాలన్నారు. భవిష్యత్ లో దళిత, బహుజనులతో పాటు మైనార్టీ ఐక్య ఉద్యమాలు చేసి హక్కులు సాధించుకుందామని పిలుపునిచ్చారు.

అనంతరం బీఎంఆర్ పీఎఫ్ వ్యవస్థాపకులు సయ్యద్ ఇస్మాయిల్ మాట్లాడుతూ సచార్ కమిట్ నివేదికను అమలు చేయాలని, స్థానిక ఎన్నికల్లో మైనార్టీలకు ప్రాధాన్యం ఇవ్వాలి అని డిమాండ్ చేశారు, మైనార్టీ లు పేదరికం లో ఉండటానికి కారణమైన పార్టీలకు గుణపాఠం చెబుతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎంఏ, మాలిక్, ప్రొఫెసర్,అన్వర్,అలీం,సయ్యద్ ఆసిఫ్ హుస్సేన్, సినీ సంగీత దర్శకులు ఎస్ ఏ ఖుద్దూస్, యూసఫ్ బాబా, శహీన్, వసీం,వాహెబ్, గబ్బార్ ,ఇక్బాల్, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed