- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Crocodile:ప్రాణభయంతో పరుగులు తీసిన కూలీలు..పొలంలో అడుగు పెట్టగానే గుండె ఆగినంత పనైందా?

దిశ,వెబ్‌డెస్క్: ఇటీవల రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. ఈ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల రైతులు పొలాల వద్దకు వెళ్లడం లేదు. దీంతో పంట పొలాల్లో కలుపు గడ్డి విపరీతంగా పెరిగింది. ఈ క్రమంలో వర్షం ఒక రోజు ఆగిపోయిన పొలం పనులు ముగించుకునే వాళ్లమని రైతులు చింతిస్తున్నారు. ఈ నేపథ్యంలో వర్షం పడని రోజు ఓ రైతు కూలీలను తీసుకొని తమ పత్తి చేనులోకి వెళ్తారు. అక్కడే ఒక ఆకారాన్ని చూసి కూలీలు భయంతో పరుగులు పెడతారు. వివరాల్లోకి వెళితే..జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల కేంద్రంలోని దేవర చెరువు వెనుక పత్తి చేనులో భారీ మొసలి ప్రత్యక్షమైంది. ఉదయం పొలంలో పనిచేస్తున్న కూలీలకు మొసలి కనిపించడంతో భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు. వెంటనే పోలీసులకు, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ సిబ్బంది రైతుల సహాయంతో మొసలిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.