- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ లేఖపై డిప్యూటీ సీఎం భట్టి సీరియస్
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మాజీ సీఎం, గులాబీ కేసీఆర్ లేఖ కాక రేపుతోంది. ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోళ్లు, యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల నిర్మాణానికి సంబంధించిన ఎంక్వైరీ కమిషన్‌కు కేసీఆర్ ఇచ్చిన రిప్లై లేఖ హాట్ టాపిక్‌గా మారింది. కమిషన్ విచారణను కేసీఆర్ తప్పుబట్టడంపై కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఫైర్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే కేసీఆర్ లేఖపై తాజాగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. విచారణ కమిషన్‌పై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. కేసీఆర్ ఏ తప్పు చేయనట్లైతే కమిషన్ ముందు విచారణకు హాజరైతే వచ్చే నష్టమేంటని ప్రశ్నించారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కోరడంతోనే గత ప్రభుత్వంలోని విద్యుత్ కొనుగోళ్లపై కమిషన్ ఏర్పాటు చేశామని తెలిపారు. గతంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కూడా కమిషన్ ముందు హాజరయ్యారని గుర్తు చేశారు. అలాంటిది తప్పు చేయనప్పుడు కేసీఆర్ కమిషన్ ముందు దర్యాప్తుకు హాజరు కావడానికి వచ్చిన సమస్య ఏంటని నిలదీశారు.