- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లిక్కర్ కుంభకోణం కేసు: పిళ్లయ్‌కు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ
దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారంలో కీలక నిందితుడిగా ఉన్న అరుణ్ రామచంద్ర పిళ్లయ్ ఈడీ కస్టడీ ముగిసిపోవడంతో 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ రౌస్ ఎవెన్యూ స్పెషల్ కోర్టు ఆదేశాలు జారీచేసింది. దీంతో ఆయనను ఈడీ అధికారులు తీహార్ జైలుకు తరలించారు. జైల్లో ఆయనకు థైరాయిడ్ మందులు, ఐ డ్రాప్స్, దుస్తులు తదితరాలను సమకూర్చాలని కోర్టు స్పష్టం చేసింది. లిక్కర్ స్కామ్‌లో ఆయనను ఈ నెల 6న అరెస్టు చేసిన ఈడీ దశలవారీగా 14 రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్నది. ఆ గడువు సోమవారం మధ్యాహ్నం ముగిసిపోవడంతో స్పెషల్ కోర్టులో ఈడీ అధికారులు హాజరుపరిచారు. వచ్చే నెల 3వ తేదీ వరకు ఆయన తీహార్ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్‌లో కొనసాగనున్నారు.
లిక్కర్ స్కామ్‌లో సౌత్ గ్రూపు కీలక భూమిక పోషించిందని ఆరోపించిన ఈడీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను, పిళ్లయ్‌ను కలిపి సోమవారం ఈడీ హెడ్‌క్వార్టర్‌లో సుమారు మూడు గంటలకు పైగా జాయింట్‌గా విచారించినట్లు తెలిసింది. కవితకు బినామీగా వ్యవహరించినట్లు గతంలో పిళ్లయ్ ఇచ్చిన స్టేట్‌మెంట్‌కు అనుగుణంగా వారిద్దరినీ ఎదురెదురుగా కూర్చోబెట్టి ఈడీ ఆఫీసర్లు సమాధానాలను రాబట్టారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలతో సౌత్ గ్రూపు తరఫున జరిగిన సంప్రదింపుల్లో కవిత తరఫున ప్రతినిధిగా వ్యవహరించారని ఈడీ అనుమానిస్తున్నది. పిళ్లయ్‌ను ఈడీ ఈ నెల 6న అరెస్టు చేయగా అప్పటి నుంచీ ఈడీ కస్టడీలోనే ఉన్న సంగతి తెలిసిందే.
కవితతో కలిసి జాయింట్ ఎంక్వయిరీ నిర్వహించి సౌత్ గ్రూపు తరఫున వీరిద్దరూ లిక్కర్ స్కామ్‌లో చేసుకున్న జోక్యం, తరలించిన రూ. 100 కోట్ల నిధులు, లెక్కల్లోకి రాని డబ్బును హవాలా మార్గంలో తరలించడం, ఈ డబ్బు ఎవరిదో మూలాలు తెలుసుకోవడం.. తదితరాలన్నింటపై దృష్టి పెట్టింది. ఇదిలా ఉండగా కవితను మరింత లోతుగా ప్రశ్నించాలని భావిస్తున్న ఈడీ ఇకపైన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, సౌత్ గ్రూపులో మరో సభ్యుడిగా ఉన్న ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, కవితకు గతంలో వ్యక్తిగత ఆడిటర్‌గా పనిచేసిన గోరంట్ల బుచ్చిబాబు తదితరులను కూడా ఈడీ జాయింట్‌గా ప్రశ్నించాలనుకుంటున్నది. కవితను ఎన్ని రోజుల పాటు విచారిస్తారన్నది.