Addanki Dayakar : నాలుగు నెలల తర్వాత వచ్చి కేసీఆర్ పగటి కలలు కంటున్నారు.. అద్దంకి దయాకర్

by Ramesh N |   ( Updated:2024-11-10 08:58:41.0  )
Addanki Dayakar : నాలుగు నెలల తర్వాత వచ్చి కేసీఆర్ పగటి కలలు కంటున్నారు.. అద్దంకి దయాకర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: నాలుగు నెలల తర్వాత కేసీఆర్ (KCR) బయటకు వచ్చి వచ్చేది తమ ప్రభుత్వమేనని పగటి కలలు కంటున్నారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ (Addanki Dayakar) విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆదివారం ఎక్స్ వేదికగా అద్దంకి దయాకర్ స్పందించారు. కేసీఆర్‌ను భరించే ఓపిక తెలంగాణ ప్రజలకు ఉందని ఆయన భ్రమ పడుతున్నారని కౌంటర్ ఇచ్చారు. కూల్చడానికి కాదు ప్రభుత్వం నిర్మించడానికి అని అంటున్నారు.. గత ప్రభుత్వంలో కేసీఆర్ విధ్వంసం చేసిన వ్యవస్థలను పునర్జీవం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. మీరు చేసిన అవినీతి క్షేత్రాలను కూల్చడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందన్నారు.

మూసీ పునర్జీవంతో (Hyderabad) హైదరాబాద్ పునర్నిర్మాణానికి (Congress) కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, మూసీని ప్రక్షాళన చేయడం కోసం అక్కడ ఉన్న ప్రజలకు ప్రత్యాన్మయం కాంగ్రెస్ చూపిస్తుందన్నారు. బురదలో, మట్టిలో, ప్రాజెక్టులలో మీరు అవినీతి చేసినట్లుగా అవినీతి కాంగ్రెస్ ప్రభుత్వం చేయదన్నారు. ప్రమాణ స్వీకారం, బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీకి ఒకసారి వచ్చావని అన్నారు. ప్రజలకు దూరంగా ఉండి.. ఈ ఏడాది కాలంలో పూర్తిగా నువ్వు ఎక్కడ ఉన్నవో తెలియదన్నారు. సంవత్సరం తర్వాత మళ్లీ బయటకు వచ్చి నేను మళ్ళీ వస్తున్న ప్రజలు నాకు అధికారం ఇస్తున్నారని భ్రమను కల్పించే ప్రయత్నం చేస్తున్నారన పేర్కొన్నారు. నీ కొడుకు, అల్లుడు బయట చేస్తున్న విధ్వంసం ఒక్కసారి చూడండి.. కాంగ్రెస్ మంచి చేసిన దుమ్మెత్తి పోస్తున్నారంటే.. అధికారం పోయిందని ఎలా ఫ్రస్టేషన్‌లో ఉన్నారో అర్ధం అవుతుందని విమర్శించారు. ఇకనైనా నిర్మాణాత్మకమైన సలహాలు ఇవ్వాలని అద్దంకి సూచనలు చేశారు.

Advertisement

Next Story