జగ్గారెడ్డి వ్యాఖ్యకు కౌంటర్ ఇచ్చిన దాసోజు శ్రవణ్.. ఏమన్నారంటే..?

by Indraja |
జగ్గారెడ్డి వ్యాఖ్యకు కౌంటర్ ఇచ్చిన దాసోజు శ్రవణ్.. ఏమన్నారంటే..?
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేత జగ్గారెడ్డి కేటీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. దాదాగిరి అంటే తెలుసా..? పైళ్వాన్ గిరి అంటే నీకు తెలుసా అని కేటీఆర్ ని ప్రశించిన ఆయన.. నువ్వు కాంగ్రెస్ నేతలకు బట్టలు తీసి కొట్టేటంత వాడివి అని మండిపడ్డారు. మీకు అంత కెపాసిటీ ఉందా అని ప్రశించిన ఆయన ఇక్కడ తాను తొడగిడితే అక్కడ నీకు గుండెలు అదిరిపోతాయని హెచ్చరించారు.

అసలు నీకు పద్ధతుందా అంటూ కేటీఆర్ పై జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే తాజాగా జగ్గారెడ్డి వ్యాఖ్యలకు దాసోజు శ్రవణ్ కౌంటర్ ఇచ్చారు. అయన తొడ గొడితే గుండెలు పగిలిపోతాయంట అని పేర్కొన్న శ్రవణ్.. మీ తొడలేమన్న ఇనుప తొడల లేక ఉక్కు తొడల మీరు తొడలు కొట్టిన వెంటనే గుండెలు పగిలిపోవడానికి అని ఎద్దేవ చేశారు. అది అసలు ఏం భాష..? ఆలా మాట్లాడే మీరు ఎలా ఎమ్మెల్యేలు అయ్యారు..? ఎలా నాయకులైయ్యారు? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.


Advertisement

Next Story