కొత్త సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన CS ఫుల్ హ్యాపీ

by GSrikanth |
కొత్త సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన CS ఫుల్ హ్యాపీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: తన 34 ఏళ్ల ఉద్యోగ ప్రయాణంలో అద్భుతమైన కొత్త కార్యాలయంలో కూర్చుని పనిచేసే అవకాశం తొలిసారిగా వచ్చిందని సీఎస్​శాంతికుమారి ఆనందం వ్యక్తం చేశారు. నూతన సచివాలయంలో మొట్ట మొదటి చీఫ్ సెక్రటరీగా పనిచేసే అవకాశం దొరకటం ఒక గొప్ప పురస్కారంగా భావిస్తున్నట్టు పేర్కొన్నారు. డాక్టర్​బీఆర్​అంబేద్కర్ తెలంగాణ సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎస్​స్వాగతోపన్యాసాన్ని చేశారు. దేశానికే దిక్సూచిగా మన రాష్ట్ర సచివాలయం వెలుగొందాలనే ఆశయానికి ప్రభుత్వ ఉద్యోగులంతా చిత్త శుద్దితో పనిచేస్తామని పేర్కొన్నారు.

ఈ సచివాలయం పై భాగంలో అమర్చిన 34 డోములు, గోడలకు పొదిగిన ఢోల్పూర్ స్టోన్స్, 8 ఎకరాల సువిశాలమైన లాన్స్, ఫౌంటైన్స్‌లతో సచివాలయం ప్రస్తుతం టాక్​ఆఫ్​ ది టౌన్‌గా మారిపోయిందన్నారు. కరోనా ప్రభావాన్ని అధిగమించి, భవన నిర్మాణాన్ని 2 సం. 90 రోజుల రికార్డ్ సమయంలో పూర్తిచేయడం గొప్ప విషయమన్నారు. హిందూ, దక్కనీ, కాకతీయుల సాంప్రదాయల అద్భుత సమ్మిళితంగా నిర్మించిన సచివాలయ భవనం, 28 ఎకరాల విస్తీర్ణంలో, 10.52 లక్షల చదరపు అడుగులతో, 265 అడుగుల ఎత్తుతో, లోయర్ గ్రౌండ్, గ్రౌండ్ మరియు 6 అంతస్తులలో నిర్మితమై రాష్ట్రానికే ఒక ఐకాన్‌గా నిలిచిందని పేర్కొన్నారు. ఈ అద్భుత సచివాలయ భవన నిర్మాణానికి రాళ్ళెత్తిన కార్మికులందరికీ ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

Next Story