- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
CPIM: టన్నెల్‌లో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకురావాలి

దిశ, తెలంగాణ బ్యూరో: నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట ప్రాంతంలోని SLBC సొరంగ పనుల్లో భాగంగా టన్నెల్ కూలి ఎనిమిది మంది సొరగంలో చిక్కుకున్న ఘటనపై విచారణ జరపాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ శనివారం ఒక ప్రటనలో డిమాండ్చేశారు. గత వారం రోజులుగా నీరు లీకేజీ అవుతున్నా అప్రమత్తంగా ఉండాల్సిన ప్రభుత్వం టన్నెల్పనుల్లో ఎలాంటి రక్షణ చర్యలు లేకుండానే పనులు చేపట్టిందన్నారు. ఈ ఘటన పట్ల సీపీఐ (ఎం ) తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్ర దిగ్ర్భాంతిని తెలియజేస్తూ ఈ ఘటననై సమగ్ర విచారణ జరిపించాలని, బాధిత కుటుంబాలకు ఎక్స్ గ్రేషియాతో పాటు వారిని అన్ని విధాలుగా ఆదుకోవాలని జాన్వెస్లీ డిమాండ్చేశారు. అంతే కాకుండా బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని, టన్నెల్‌లో చిక్కుకున్న వారి నందరినీ సురక్షితంగా బయటకు తీసుకురావడానికి చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్చేస్తున్నట్లు తెలిపారు.