CPI Narayana: భారత్ మరో బంగ్లా దేశ్ అవుతుంది

by Gantepaka Srikanth |
CPI Narayana: భారత్ మరో బంగ్లా దేశ్ అవుతుంది
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉండాల్సిన గవర్నర్ వ్యవస్థ దళారీ వ్యవస్థగా మారిందని నారాయణ ఘాటు విమర్శలు చేశారు. శుక్రవారం హైదరాబాద్‌‌లోని ముగ్దుమ్ భవన్‌లో మీడియాతో మాట్లాడారు.. జూనియర్ డాక్టర్ అత్యాచార ఘటనపై పశ్చిమబెంగాల్ గవర్నర్ సీ.వీ ఆనంద్ స్పందించాల్సిందేనని, కానీ మీడియా సమావేశంలో ఆయన ఒక గవర్నర్ కాకుండా బీజేపీ నాయకునిగా, కార్యకర్తగా మాట్లాడటం దారుణమన్నారు. కేంద్రానికి సహకరించని రాష్ట్ర ప్రభుత్వాలను గవర్నర్ వ్యవస్థ ద్వారా కేంద్రం ఇబ్బందులకు గురిచేస్తోందని మండిపడ్డారు. దేశంలో ఆర్ఎస్ఎస్ ఎజెండాను బీజేపీ అమలు చేస్తోందని ఆరోపించారు. ప్రతిపక్షాలు లేకుండా చేయాలని బీజేపీ కుట్ర చేస్తుందన్నారు.

బంగ్లాదేశ్ ఘటన ఓ గుణపాఠం :

నియతృత్వ ధోరణితో వ్యవహరిస్తూ అంతులేని అవినీతి అక్రమాలకు పాల్పడే పాలకులకు ఆంధ్రాలో వైసీపీకి పట్టిన గతే పడుతుందని అన్నారు. కేంద్రంలోని బీజేపీ కూడా నైతికంగా పూర్తిగా ఓడిపోయిందని అన్నారు. పాలకులకు బంగ్లాదేశ్ ఘటన ఓ గుణపాఠం కావాలన్నారు. అక్కడ అవినీతితో పాటు ఏకపక్ష ధోరణి, నియతృత్వ పాలన కొనసాగించడంతో పాటు, ప్రతిపక్షాలు లేకుండా చేయాలనే దురాశతో అక్కడి ప్రజలు ప్రధానిపై తిరుగుబాటుకు పాల్పడ్డారని ఆమె తట్టుకోలేక పారిపోవాల్సి వచ్చిందని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాల్లో మార్పు రాకపోతే భారత్ మరో బంగ్లా కావడం ఖాయమన్నారు.

Advertisement

Next Story

Most Viewed