ముఖ్యమంత్రికి, సబితా ఇంద్రారెడ్డి మధ్య బంధుత్వం ఉంది: కూనంనేని

by Gantepaka Srikanth |
ముఖ్యమంత్రికి, సబితా ఇంద్రారెడ్డి మధ్య బంధుత్వం ఉంది: కూనంనేని
X

దిశ, తెలంగాణ బ్యూరో: పదేళ్లు పరిపాలించిన వారు ఆ కింద (స్పీకర్ పోడియం ముందు) కూర్చోవడం, తమలాగా, కమ్యూనిస్టు పార్టీ తరహాలో నినాదాలు ఇవ్వడం చాలా బాధాకరమమని సీపీఐ శాసనసభాపక్ష నేత కూనంనేని సాంబశివరావు అన్నారు. అసెంబ్లీలో గురువారం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బిల్లుపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. “నేను మంచి మాటనే చెబుతాను.. ఎవరినీ మాట్లాడనివ్వబోరా?, తమలాంటి వారిని కూడా మాట్లాడనివ్వకపోతే మీరు ఎదో పెట్టుకున్నట్టుగా ఉన్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‘ఆ ఇద్దరు సోదరీమనుల పట్ల తమకు సానుభూతి ఉన్నదని, ఇందులో ఎటువంటి భిన్నాభిప్రాయాలు లేవని, అదే సమయంలో అక్కడ మాట్లాడే ఒరవడిలో సాధారణంగా, ఉద్దేశపూర్వంగా అవమాపర్చారా? లేదా? అనే అంశాలను కూడా చూడాలని సూచించారు. ముఖ్యమంత్రికి, సబితా ఇంద్రారెడ్డి మధ్య అక్కా తమ్ముళ్ల అనుబంధం ఉన్నదని, వారిమధ్య బంధుత్వం కూడా ఉన్నదని, అందుకే దీనిని పొడిగించకుండా ఒక చోట కూర్చొని సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు.

నిరసన వ్యక్తం చేస్తున్న క్రమంలో ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చలో తనకు మాట్లాడే అవకాశాన్ని కోల్పోయామని, ఇప్పుడు కూడా స్కీల్ యూనివరిట్సీకి చెందిన ముఖ్యమైన బిల్లును మాట్లాడనివ్వడం లేదన్నారు. అప్పడు తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో శాసనసభ సమావేశాలను కొనసాగనివ్వలేదని, అప్పుడు అన్ని రాజకీయ పార్టీలూ కలిశాయని, కానీ ఇప్పుడు ఒక చిన్న అంశంపైన తేడా వచ్చిందని వివరించారు. తాము మహిళలను గౌరవించేవారిలో ముందుంటామని, అటువంటి తమను కూడా మాట్లడనివ్వకుండా చేయడం లేదన్నారు. సభ సజావుగా సాగేలా వారిని ఆహ్వానించి, చర్చించి సమస్యను పరిష్కరించాలని, తద్వారా సభలో చర్చ సజావుగా సాగుతుందని స్పీకర్ ను కోరారు. ఎస్సీ వర్గీకరణకు సీపీఐ మొదటి నుంచి పూర్తి స్థాయి మద్దతునిచ్చిందని తెలిపారు. వర్గీకరణ పట్ల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును మనస్పూర్తిగా స్వాగతిస్తున్నానని తెలిపారు. రాష్ట్రంలో 7వ, 10వ తరగతి ఫెయిల్ అయినవారు ఉన్నారని, వారికి శిక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో ఐఐటీ, ఇంజనీరింగ్ కళాశాలు ఉన్నప్పటికీ చదువుకున్న విద్యార్థుల్లో 30శాతం కూడా ఉద్యోగాలు రావడం లేదన్నారు. పాలిటెక్నికల్ కాశాలలపై ఎందుకు దృష్టి సారించడం లేదన్నారు. వాటిలో సాప్ట్ స్కిల్స్ బలోపేతం చేయాలని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed