TS: సీపీఐ పార్టీకి రాష్ట్ర ఎన్నికల కమిషన్ శుభవార్త

by GSrikanth |
TS: సీపీఐ పార్టీకి రాష్ట్ర ఎన్నికల కమిషన్ శుభవార్త
X

దిశ, తెలంగాణ బ్యూరో: భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ)కి జాతీయ పార్టీ గుర్తింపును కేంద్ర ఎన్నికల సంఘం రద్దు చేసినా తెలంగాణలో మాత్రం అది స్టేట్ పార్టీగా కంటిన్యూ కానున్నది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ విషయాన్ని స్పష్టం చేసింది. కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వుల ప్రకారం సీపీఐ ఇంతకాలం ఒక జాతీయ పార్టీగా కొనసాగినా ఇటీవల కొన్ని ప్రమాణాల మేరకు ఆ అర్హతను కోల్పోయిందంటూ నేషనల్ పార్టీ స్టేటస్‌ను తొలగించింది. ఈ ఉత్తర్వుల ఆధారంగా తెలంగాణలో ఆ పార్టీకి ఉన్న స్టేటస్‌పై రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్టడీ చేసింది. కేంద్ర కమిషన్ ప్రకారం పశ్చిమబెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో స్టేట్ పార్టీ స్టేటస్‌ను కూడా సీపీఐ కోల్పోయింది. కానీ మణిపూర్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో మాత్రం ఆ స్టేటస్ పదిలంగా ఉన్నదని స్పష్టం చేసింది.

ఈ ఉత్తర్వుల నేపథ్యంలో తెలంగాణలో సీపీఐ స్టేట్ పార్టీ గుర్తింపుపై స్టేట్ ఎలక్షన్ కమిషన్ దృష్టి పెట్టింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ బాధ్యతలను స్టేట్ కమిషన్ చూస్తున్నందున గడచిన ఎన్నికల్లో ఆ పార్టీ సాధించిన ఓటింగ్ శాతం తదితరాలను పరిగణనలోకి తీసుకుని ఇప్పటికీ రాష్ట్రంలో స్టేట్ పార్టీగా గుర్తింపును కొనసాగించుకోవచ్చని స్పష్టత ఇచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించిన ‘రిజిస్ట్రేషన్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ అండ్ అలాట్‌మెంట్ ఆఫ్ సింబల్స్ ఆర్డర్ 2018’లోని సెక్షన్ 2(6) ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో స్టేట్ రికగ్నైజ్డ్ పార్టీగా కంకీ కొడవలి గుర్తుతో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయవచ్చని, కామన్ ఎలక్షన్ సింబల్‌గా ఇంతకాలం వాడుకున్న చిహ్నాన్నే కొనసాగించుకోవచ్చని రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కార్యదర్శి అశోక్‌కుమార్ ఇటీవల వెల్లడించిన సర్క్యులర్‌లో స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed