వామ్మో.. 14 యూనిట్లకు కరెంట్ బిల్లు ఎంత వచ్చిందే తెలిస్తే షాకే..!

by Disha Web Desk 4 |
వామ్మో.. 14 యూనిట్లకు కరెంట్ బిల్లు ఎంత వచ్చిందే తెలిస్తే షాకే..!
X

దిశ, జగిత్యాల రూరల్ : మండుటెండలకు చెమటలు పట్టుడు ఏమో కాని ఈ కరెంట్ బిల్లు చూస్తే మాత్రం ముచ్చెమటలు పడతాయి. జగిత్యాల పట్టణంలోని బైపాస్ రోడ్డులో ఓ షాప్ యజమానికి కరెంట్ బిల్లు చూడగానే షాక్ తలిగింది. యజమాని మాట్లాడుతూ తన షాప్‌నకు ప్రతి నెల కరెంట్ బిల్లు 200 రాగా, ఇపుడు కేవలం 14 యూనిట్లకు ఏకంగా రూ.60701 బిల్లు వచ్చిందని వాపోయారు. ఎండలకు కండ్లు తిరిగి పడటం ఏమో కాని బిల్లు చూస్తే కండ్లు తిరిగడం ఖాయం అని స్థానికులు చర్చించుకుంటున్నారు.

Next Story