- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైతులకు గాలం వేసేందుకు కాంగ్రెస్ స్కెచ్.. ఒకే సారి రెండు లక్షలు రుణమాఫీ!
దిశ, తెలంగాణ బ్యూరో: రైతు బంధుతో రైతులంతా తమకే ఓట్లు వేస్తారనే భ్రమలో ఉన్న బీఆర్ఎస్పార్టీకి కాంగ్రెస్ షాక్ ఇవ్వనున్నది. ఏకకాలంలో రుణమాఫీ ప్రచారాన్ని ఇంటింటికీ తీసుకవెళ్లనున్నది. ఒకే విడతతో రూ.2 లక్షలు రైతు రుణాల మాఫీకి ఫిక్స్ అయింది. 2004లో వైఎస్సార్ప్రభుత్వం ఏర్పడగానే ఒక్క సంతకంతో రూ.లక్ష రూణమాఫీ చేసినట్లే.. ఈ సారి రూ.రెండు లక్షలు చేయనున్నట్లు ఆ పార్టీ విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లనున్నది.
ఊరూరా ప్రచారం చేయాలని భావిస్తున్నది. ఈ మేరకు అన్ని జిల్లాల్లో ఫ్లెక్సీలు రెడీ అవుతున్నాయి. వీటిని జిల్లా, మండల కేంద్రాలు, మార్కెట్లు, రైతు బజార్లలో ఏర్పాటు చేయనున్నారు. కిసాన్కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్సమన్వయమై ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లనున్నాయి. వాస్తవానికి వరంగల్ రైతు డిక్లరేషన్‌లోనే రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ ఏ విధానంలో చేయనున్నదనే అంశాన్ని ప్రస్తావించలేదు. ఇప్పుడు ఏఐసీసీ ఆదేశాల మేరకు ఒక్క సంతకంతో రూ.రెండు లక్షలు మాఫీ అని కాంగ్రెస్పార్టీ రైతుల్లోకి వెళ్లనున్నది.
47 లక్షల మంది రైతులు
రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధు తీసుకుంటున్న లెక్కల ప్రకారం 67 లక్షల మంది రైతులు ఉన్నట్లు అంచనా. అయితే లక్ష రూపాయల రుణమాఫీకి 35 లక్షల మంది రైతులను ప్రభుత్వం గతంలో గుర్తించింది. ఇక రూ.రెండు లక్షల వరకు పెంచితే దాదాపు 47 లక్షల మంది అర్హత పొందుతారని కాంగ్రెస్పార్టీ సమచారాన్ని సేకరించింది. ఈ వివరాలన్నింటినీ కాంగ్రెస్పార్టీ కరపత్రాలు, ఫ్లెక్సీల రూపంలో ప్రజలకు వివరించాలని ప్లాన్ చేస్తున్నది. దీంతో పాటు కౌలు రైతుల సమస్యలు, పోడు భూములు చిక్కులు వంటివన్నీంటిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కాంగ్రెస్భావిస్తున్నది.
మద్దతు లభిస్తుందనే ఆశ..?
రాష్ట్ర వ్యాప్తంగా రైతులంతా ప్రస్తుతం బీఆర్ఎస్వైపు ఉన్నారనే ప్రచారం జోరుగా కొనసాగుతోంది. అయితే రుణమాఫీతో ఆ వర్గాన్ని తమ వైపునకు తిప్పుకోవాలని కాంగ్రెస్ప్రయత్నిస్తోన్నది. గతంలో లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని బీఆర్ఎస్పార్టీ ఎన్నికల సమయంలో ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. దీన్ని రైతు రుణమాఫీ చేసి ఆ వర్గాన్ని తమవైపు తిప్పుకోవాలని చూస్తోంది.
ఇవి కూడా చదవండి: ఉచిత ఎరువుల హామీకి ఆరేండ్లు కంప్లీట్! దేశం ఆగమయ్యేది ఎప్పుడు?