- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాహుల్‌కు హరీష్ రావు లేఖ.. కాంగ్రెస్ ఎంపీ కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: రాహుల్ గాంధీ(Rahul Gandhi)కి బీఆర్ఎస్(BRS) నేత హరీష్ రావు(Harish Rao) లేఖ రాయడంపై కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి(MP Mallu Ravi) స్పందించారు. మంగళవారం మల్లు రవి మీడియాతో మాట్లాడారు. మూసీని అభివృద్ధి చేయాలని ప్రభుత్వానికి అనేక విజ్ఞప్తులు వచ్చాయని తెలిపారు. పేదల పొట్ట కొట్టాలనే ఉద్దేశం ప్రభుత్వానికి ఎంతమాత్రం లేదని అన్నారు. రాహుల్ గాంధీకి హరీష్ రావు మూసీ బాధితుల కోసం లేఖ రాయలేదని.. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డికి వస్తోన్న ఆదరణ చూసి తట్టుకోలేక లేఖ రాశారని విమర్శించారు. అసలు మూసీపై ఇంకా డీపీఆరే సిద్ధం కాలేదని అన్నారు.
కాగా, తెలంగాణలో బుల్డోజర్ రాజ్యం నడుస్తుందని రాహుల్‌కు రాసిన లేఖలో హరీష్ రావు పేర్కొన్న విషయం తెలిసిందే. అంతేకాదు.. తెలంగాణలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఆధారంగా కాకుండా, అధికార దుర్వినియోగంతో దుర్మార్గ, దుష్ట పాలన నడుస్తుందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మానవత్వాన్ని, న్యాయాన్ని బుల్డోజర్ కింద తొక్కి అణచివేస్తూ, రాజ్యాంగ విరుద్ధ చర్యలకు పాల్పడుతున్నట్లు లేఖలో విమర్శించారు. మూసీ రివర్ ఫ్రంట్, హైడ్రా ప్రాజెక్టుల విషయంలో హైకోర్టు చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనమన్నారు. దయచేసి తెలంగాణను కాపాడాలని లేఖలో రాహుల్‌ను హరీష్ రావు రిక్వెస్ట్ చేశారు. తాజాగా హరీష్ రావు లేఖపై స్పందించిన మల్లు రవి హరీష్ రావుపై విమర్శలు చేశారు.