కిషన్‌రెడ్డికి కాంగ్రెస్‌ నేతలు వివేక్‌, వంశీ ఫోన్.. ఎందుకో తెలుసా?

by Gantepaka Srikanth |
కిషన్‌రెడ్డికి కాంగ్రెస్‌ నేతలు వివేక్‌, వంశీ ఫోన్.. ఎందుకో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy)కి కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి(Vivek Venkatswamy), ఎంపీ గడ్డం వంశీ(Gaddam Vamsi Krishna) ఫోన్ చేశారు. మంచిర్యాల జిల్లాలో పత్తి కొనుగోళ్ల జాప్యంపై వివరించారు. మాన్యువల్‌ ద్వారా పత్తి కొనుగోళ్లు(Cotton Purchases) చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. దీనికి సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి.. సీసీఐతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు.. పత్తి కొనడం లేదంటూ మంచిర్యాల జిల్లాలోని పలు మండలాల రైతులు బెల్లంపల్లిలోని శ్రీరామ జిన్నింగ్‌ మిల్లు వద్ద ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగారు. సీసీఐ(CCI) అధికారులు పత్తిని కొనుగోలు చేయకపోవడం వల్ల వారం నుంచి పడిగాపులు కాస్తున్నామని, వాహనాల కిరాయి భారం పడుతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు.

ఆరుగాలం శ్రమించి పండించిన పత్తిని విక్రయించేందుకు నానాపాట్లు పడుతున్నామని అన్నారు. తాజాగా రెండు రోజుల నుంచి ఆధార్‌ సర్వర్‌ పనిచేయకపోవడంతో సీసీఐ కొనుగోలు చేయడం లేదు. గత్యంతరం లేక కర్షకులు ప్రైవేటులో తక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది.

Next Story

Most Viewed