- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌పై ఫిర్యాదు చేసిందే మేము: పవన్ ఖేరా కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌పై ఫిర్యాదు చేసిందే మేమని.. కాంగ్రెస్ పార్టీ పోరాటం వల్లే లిక్కర్ స్కాంలో కదలిక వచ్చిందని ఏఐసీసీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా తెలిపారు. అలాంటిది లిక్కర్ స్కామ్‌లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ కవితకు ఎందుకు మద్దతు తెలుపుతుందని ప్రశ్నించారు. శనివారం ఆయన గాంధీ భవన్‌లో మాట్లాడుతూ.. మా పోరాటం, ఒత్తిడి వల్లే సీబీఐ కవిత ఇంటికి వచ్చి విచారణ జరిపిందన్నారు. శంషాబాద్‌లో దిగగానే బీఆర్ఎస్ పోస్టర్లు కనిపిస్తున్నాయి.. బీఆర్ఎస్‌లో ఇంకో మహిళ లేనట్టు కవిత ఒక్కరి ఫోటోనే కనిపిస్తుందని అన్నారు.
కవిత ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంట్‌లో మహిళల హక్కుల కోసం ఎన్నిసార్లు మాట్లాడింది.. కవితకి మహిళ సాధికారత గురించి ఇన్నాళ్ళకి గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్‌గా మారే క్రమంలో కావాల్సిన డబ్బులు ఇక్కడి నుండి వస్తున్నాయని.. సామాన్య ప్రజల నుండి డబ్బులు కొల్లగొట్టి బీఆర్ఎస్ పార్టీ కోసం వాడుకుంటుందని ఆరోపించారు. బీఆర్ఎస్‌కు తెలంగాణ తప్పితే వేరే రాష్ట్రంలో ఒక్క సర్పంచ్‌ని కూడా గెలిలించుకునే పరిస్థితి లేదని.. బీఆర్ఎస్ కుటుంబానికి వీఆర్ఎస్ ప్రకటించాలని పిలుపునిచ్చారు.