- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
YouTube Premium: ఆ జియో యూజర్లకు సంక్రాంతి బంపర్ ఆఫర్...యూట్యూబ్ ప్రీమియం సబ్ స్క్రిప్షన్ ఫ్రీ

YouTube Premium: జియో (Jio) తన జియో ఎయిర్ ఫైబర్ (JioAirFiber), జియోఫైబర్(JioFiber)యూజర్లకు సంక్రాంతి బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇప్పుడు ఈ యూజర్లు 24 నెలల పాటు YouTube ప్రీమియంను ఫ్రీగా ఉపయోగించుకోవచ్చు. అంటే యూజర్లు ఎలాంటి యాడ్స్ లేకుండా యూట్యూబ్(YouTube) ను వీక్షించవచ్చు. వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మ్యూజిక్ వినొచ్చు. ఈ ఆఫర్ గురించి వివరంగా తెలుసుకుందాం.
YouTube Premium: రిలయన్స్ జియో తన జియో ఎయిర్ ఫైబర్(JioAirFiber) జియో ఫైబర్ (JioFiber) పోస్ట్‌పెయిడ్ యూజర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. జియో(Jio) 24 నెలల పాటు యూట్యూబ్ (YouTube) ప్రీమియం ఫ్రీ సబ్ స్క్రిప్షన్ అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఈ ఫ్రీ సబ్ స్క్రీప్షన్ 11 జనవరి 2025 నుండి ప్రారంభం అయ్యింది. యూట్యూబ్(YouTube) ప్రీమియం ప్రారంభ ధర రూ. 149. ఇది జియో ఎయిర్ ఫైబర్, జియో ఫైబర్ యూజర్లకు ఫ్రీగా అందిస్తుంది.
ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చు?
-జియో యూట్యూబ్ ప్రీమియం(Jio YouTube Premium) ఫ్రీ సబ్ స్క్రిప్షన్ తో యూజర్లకు తమకు ఇష్టమైన వీడియోలను ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడవచ్చు. అంటే మధ్యలో యాడ్స్ కనిపించవు. ఆఫ్ లైన్ వీడియో()లను చూసే సౌకర్యం కూడా ఉంటుంది. వినియోగదారులు ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా కూడా యూట్యూబ్ (YouTube) కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
-అంతే కాకుండా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్(Background music) ప్లే సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది. ఇది ఇతర యాప్‌లను ఉపయోగిస్తున్నప్పుడు లేదా మీ స్క్రీన్ ఆఫ్‌లో ఉన్నప్పుడు కూడా వీడియోలను చూడటం లేదా మ్యూజిక్ వినవచ్చు. యూట్యూబ్ మ్యూజిక్ ప్రీమియం 100 ( YouTube Music Premium 100) మిలియన్లకు పైగా యాడ్స్ లేకుండా పాటు, పర్సనలైజ్డ్ ప్లేలిస్టు, గ్లోబల్ చార్ట్-టాపర్లను హ్యాపీగా ఆస్వాదించవచ్చు.
ఈ ఆఫర్ జియో ఎయిర్ ఫైబర్, జియోఫైబర్ పోస్ట్ పెయిడ్ యూజర్లకు అందుబాటులో ఉంటుంది. ఆఫర్ పొందేందుకు జియో ఎయిర్ ఫైబర్, జియో ఫైబర్ పోస్ట్ పెయిడ్ యూజర్లు రూ. 888, రూ. 199, రూ. 1499, రూ. 2499, రూ. 3499ల్లో ఏదైనా ప్లాన్ కు సబ్ స్క్రైబ్ చేసుకోవాలి.
YouTube ప్రీమియం సబ్ స్క్రిప్షన్ ఎలా పొందాలి?
-ముందుగా MyJioలో మీ అకౌంట్ కు లాగిన్ చేయండి.
-పేజీలో కనిపించే YouTube ప్రీమియం బ్యానర్‌పై క్లిక్ చేయండి.
-మీ అకౌంట్ తో YouTubeకి సైన్ ఇన్ చేయండి లేదా కొత్త అకౌంట్ ను క్రియేట్ చేసుకోండి.
-అదే ఆధారాలతో లాగిన్ చేస్తే మీ JioFiber లేదా JioAirFiber సెట్-టాప్ బాక్స్‌లో యాడ్స్ ఫ్రీ YouTube కంటెంట్‌ను ఆస్వాదించండి.
జియో ఎయిర్ ఫైబర్, జియో ఫైబర్ అంటే ఏమిటి?
ఇది వైర్‌లెస్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్. ఇందులో, 5G టెక్నాలజీని ఉపయోగించి హై-స్పీడ్ ఇంటర్నెట్ అందిస్తుంది. Jio AirFiber ద్వారా, ఒకే Wi-Fi పరికరం సహాయంతో అన్ లిమిటెడ్ ఇంటర్నెట్, TV ఛానెల్‌లు, OTT ప్లాట్‌ఫారమ్‌లను ఆస్వాదించవచ్చు. అయితే JioFiber బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్, ఇది 1Gbps వరకు హై-స్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందిస్తుంది. అలాగే అనేక రకాల బండిల్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.