- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రియాంక, రేవంత్‌ల గురించి మాట్లాడే హక్కు కేటీఆర్‌కు లేదు: మల్లు రవి
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రియాంక గాంధీ, రేవంత్‌రెడ్డి గురించి మాట్లాడే హక్కు కేటీఆర్‌కు లేదని టీపీసీసీ వైస్‌ప్రెసిడెంట్ మల్లు రవి పేర్కొన్నారు. ప్రియాంక గాంధీ, రేవంత్‌రెడ్డి గురించి మాట్లాడే హక్కు కేటీఆర్‌కు లేదని టీపీసీసీ వైస్‌ప్రెసిడెంట్ మల్లు రవి పేర్కొన్నారు. సోమవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ప్రియాంక గాంధీని పొలిటికల్ టూరిస్ట్ అని కేటీఆర్ వ్యాఖ్యానించడాన్ని ఖండిస్తున్నామన్నారు. కేటీఆర్ అనాలోచితంగా మాట్లాడుతున్నారన్నారు. బీఆర్ఎస్ పేరుతో వివిధ రాష్ట్రాలు తిరుగుతున్న నాయకులూ పొలిటికల్ టూరిస్టులేనా? అంటూ ప్రశ్నించారు.
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీలో ఇద్దరే ఉన్నారని కేటీఆర్ ఎలా.. చెబుతారని విమర్శించారు. దర్యాప్తు సంస్థ సిట్ రిపోర్ట్ ఇవ్వకముందే ఎలా ప్రకటిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ రాజ్యాంగేతర శక్తిగా మారారని మండిపడ్డారు. మరోవైపు రేవంత్ రెడ్డిని గాడ్సేతో పోల్చడం కేటీఆర్దొర అహంకారానికి నిదర్శనం అన్నారు. ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డిలకు కేటీఆర్ క్షమాపణ చెప్పాలసిన అవసరం ఉన్నదని, లేకుంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు.