- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వికలాంగుల పింఛన్.. బీఆర్ఎస్ కంటే ఎక్కువే ఇచ్చేలా కాంగ్రెస్ కసరత్తు
దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ ప్రకటించిన దాని కంటే వికలాంగులకు ఎక్కువ పింఛన్ ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇప్పటికే వికలాంగులకు రూ.4016 పింఛన్ ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. అయితే తాము రూ.6 వేలు పింఛన్ ఇస్తామని బీఆర్ఎస్ తన మేనిఫెస్టోలో పొందుపరిచింది. దీంతో ఆ పింఛన్ ను పెంచి మళ్లీ ప్రకటించాలని కాంగ్రెస్ ఆలోచిస్తున్నది. మేనిఫెస్టోలో పొందుపరిచేలా కసరత్తు చేస్తున్నది. ఈ మేరకు ఏఐసీసీ, టీపీసీసీ నేతల నుంచి అభిప్రాయాలను సేకరిస్తున్నది.
దీంతోపాటు ప్రజలు, మేధావులు, విద్యావంతులు, నిరుద్యోగులు, వివిధ కుల సంఘాల నుంచి వచ్చిన ప్రపోజల్స్ పై కూడా మేనిఫెస్టో కమిటీ క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నది. హామీల సాధ్యాసాధ్యాలపై నిపుణులు, వివిధ యూనివర్సిటీల ప్రొఫెసర్ల నుంచి సలహాలు, సూచనలను కాంగ్రెస్ పార్టీ సేకరిస్తుంది. హామీలతో కూడిన ముసాయిదా టెంపరరీ కాపీ రెడీ కాగా.. హైకమాండ్ ఆదేశాల కొరకు రాష్ట్ర పార్టీ వెయిటింగ్ చేస్తున్నది. గురు, శుక్రవారాల్లో థర్డ్ లిస్ట్ రిలీజ్ చేయాలని ఏఐసీసీ కసరత్తు చేస్తుండగా, ఆ తర్వాతే మేనిఫెస్టో విడుదల చేయాలని రాష్ట్ర పార్టీ ప్రణాళికలు తయారు చేస్తున్నది.
పబ్లిసిటీ చేసేలా ట్రైనింగ్
పార్టీ ఇప్పటికే ప్రకటించిన ఆరు గ్యారెంటీ లతోపాటు అతి త్వరలో ప్రకటించే మేనిఫెస్టోకు కూడా ఫుల్ పబ్లిసిటీ ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తున్నది. మేనిఫెస్టో బుక్ లెట్ ను పార్టీ ప్రతి ఇంటికి చేర్చనున్నది. ఈ మేరకు మండలాల వారీగా స్పెషల్ టీమ్ లను నియమించింది. ఈ టీమ్ లకు శుక్రవారం గాంధీభవన్ లో ని ప్రకాశం హాల్ లో ఒక రోజు ట్రైనింగ్ ఇవ్వనున్నారు. మేనిఫెస్టోను ప్రజలకు ఎలా వివరించాలి? ఓటర్లను ఆకట్టుకునేందుకు చేయాల్సిన పనులు, పొలింగ్ బూత్ లలో వ్యవహరించాల్సిన తీరు, పార్టీ కి మైలేజీ వచ్చేలా చేసే పనులన్నింటిపై ముఖ్య లీడర్లు ప్రజంటేషన్ ఇవ్వనున్నారు.
ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ లతోపాటు వార్డు మెంబర్లకు వేతనాలు, రేషన్ షాపుల్లో సన్నబియ్యం, కల్యాణలక్ష్మీ తో పాటు తులం బంగారం, విద్యార్థులకు ఫ్రీ వైఫై, స్విగ్గి, జొమాటో తదితర గిగ్ వర్కర్లకు రాజస్థాన్ తరహాలో ఉద్యోగ భద్రత చట్టం, అన్ని కులాలకు కార్పొరేషన్లు.. ఇలా మేనిఫెస్టో కొరకు ఫైనల్ చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.