- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
విపక్ష నేతలతో ప్రభుత్వాన్ని తిట్టించడం ఏంటి?.. VH ఇంట్లో కాపు నేతల సమావేశంపై ఏఐసీసీ ఫైర్

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) కీలక నేత, మాజీ ఎంపీ వీ.హనుమంత రావు(V. Hanumantha Rao) ఇంట్లో మున్నూరు కాపు(Kapu Leaders) నేతల సమావేశంపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ అయింది. ప్రతిపక్ష పార్టీల నేతలతో సమావేశమై.. సొంత ప్రభుత్వాన్ని తిట్టించడం ఏంటని ఏఐసీసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నో ఏళ్లుగా బీసీలు ఎదురుచూస్తున్న బీసీ కులగణన చేస్తే అభినందించాల్సింది పోయి.. విమర్శలా.. కాంగ్రెస్ లీడ్ చేయాల్సిన సమావేశానికి.. ప్రతిపక్ష పార్టీలను పిలవడం ఏంటని మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan) ప్రశ్నించింది. దీనిపై తక్షణమే సమాధానం చెప్పాలని మండిపడింది.
కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) బీసీ కుల గణన(BC Caste Census) చేపట్టి బీసీలకు దక్కాల్సిన రిజర్వేషన్లను కల్పిస్తామన్న హామీ ఇచ్చింది. ఇందుకు కాంగ్రెస్‌పార్టీ స్వయంగా పార్టీలోని బీసీ సామాజిక నేతలో భేటీ నిర్వహించి, కుల గణన ప్రాధాన్యతను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించింది. దీంతోనే ఏకతాటిపైకి బీసీ సామాజిక వర్గాలు, ఆయా కుల సంఘాలు సమావేశాలు నిర్వహించుకొని తమ బలాన్ని నిరూపించుకోవాలని చూస్తున్నాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్నగరంలో యాదవ కుల సంఘం ప్రత్యేకించి మీటింగ్ ఏర్పాటు చేసుకొని, రాజకీయంగా తమ సామాజిక వర్గానికి జరుగుతున్న అన్యాయాన్ని ఎండగట్టింది.
తాజాగా.. మున్నూరు కాపు సంఘం నేతలు(Munnuru Kapu Community Leaders) శనివారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కాంగ్రెస్‌పార్టీ మాజీ పీసీసీ చీఫ్, మాజీ ఎంపీ వి.హనుమంతరావు నేతృత్వంలో ఆయన ఇంట్లోనే కాపు నేతలంతా సమావేశం అయ్యారు. ఇందులో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నుంచి కీలక నేతలు హాజరవ్వడం తెలంగాణలో హాట్‌టాపిక్‌గా మారింది.