- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
త్వరలో చేనేతలకు సర్కార్ గుడ్ న్యూస్.. దీర్ఘకాల ప్రయోజనాలే లక్ష్యంగా ప్లాన్
దిశ, తెలంగాణ బ్యూరో: ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న నేత కార్మికులకు అండగా నిలిచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నేతన్న భరోసా కార్యక్రమాన్ని త్వరలో అమలుచేయనున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు వెల్లడించారు. చేనేత, మరమగ్గాల కార్మికుల సంక్షేమం కొరకు తాత్కాలిక ప్రయోజనం కంటే దీర్ఘకాలికంగా లబ్ధి చేకూరే నిమిత్తం పధకముల రూపకల్పనపై కసరత్తు చేస్తున్నారు. దీనిలో భాగంగా నేత కార్మికుల స్వయం సమృద్ధి కొరకు నేతన్న భరోసా అనే ప్రభుత్వ విధానమును రూపొందించుట కొరకు చర్యలు చేపట్టారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (ఐఐహెచ్టి ) ఏర్పాటు, హ్యాండ్లూమ్ పార్క్ పునరుద్ధరణ, కొత్త పవర్ లూమ్ క్లస్టర్ల అభివృద్ధి పరిచేందుకు కృషి చేస్తున్నారు. న్యూ మైక్రో హ్యాండ్లూమ్ క్లస్టర్స్ ఏర్పాటు, నేషనల్ సెంటర్ ఫర్ డిజైన్స్ ఏర్పాటుకు, స్టేట్ టెక్నికల్ టెక్స్టైల్ పాలసీ రూపొందించే ప్రక్రియలో అధికారయంత్రాంగం నిమగ్నమైంది.
చేనేత కార్మికులకు చెల్లించాల్సిన డబ్బులను గత ప్రభుత్వం మాత్రం విస్మరించింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు నేతన్నలకు ఇచ్చిన హామీమేరకు అండగా వుంటామని చెప్పిన విదంగానే అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా గత ప్రభుత్వ హయాంలో చేనేత సహకార సంఘాలకు పెండింగ్‌లో వున్నా రూ. 8.81 కోట్లు నిధులను మంజూరు చేసింది. దీనికి తోడు మరో రూ. 7 కోట్ల రూపాయలను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు ప్రారంభించింది. ఎలక్షన్ కోడ్ ఆటంకంగామారడంతోనే ఈ నిధులు విడుదల కాలేదని, కోడ్ ముగిసిన తర్వాత ఈ నిధులు విడుదల కానున్నాయని తెలిసింది.
గత ఏడాది నవంబర్ వరకు 488.38 కోట్లు వివిధ ప్రభుత్వశాఖల నుండి టెస్కొకు రావాల్సిన బకాయిలను నేత కార్మికులకు చెల్లించాల్సి వుంది.. 2023 బతుకమ్మ చీరల పథకము క్రింద టెస్కో కు చెల్లించవలసిన 351.52 కోట్లను కూడా గత ప్రభుత్వం చెల్లించలేదు. రాష్ట్రంలోని మొత్తం చేనేత సహకార సంఘాల సభ్యులకు పని కలిపించుటకు నేటివరకు సుమారుగా 53 కోట్ల విలువైన వస్త్రాలను కాంగ్రెస్ ప్రభుతం కొనుగోలు చేసింది. సమగ్ర శిక్ష పథకం కింద యూనిఫాం సరఫరా నిమిత్తం 50 శాతం అడ్వాన్సు గా నూలు కొనుగోలు, సైజింగ్ కొరకు సుమారుగా 47 కోట్ల రూపాయలను విడుదల చేసారు . అలాగే కేంద్ర ప్రభుత్వం నుండి వివిధ పథకముల కింద రావాల్సిన బకాయిలు మంజూరు కొరకు స్పెషల్ ఫోకస్ పెట్టింది.