- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Congress: కేసీఆర్ గాంధీ కాదు గాడ్సే.. ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఫైర్
దిశ, తెలంగాణ బ్యూరో: కేసీఆర్(KCR) గాంధీ కాదని, గాడ్సే(Godse) అని కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి(Congress MLA Mal Reddy Rangareddy) పేర్కొన్నారు. కేసీఆర్ ను గాంధీతో పోల్చడం విచిత్రంగా ఉన్నదన్నారు. శనివారం ఆయన అసెంబ్లీలోని సీఎల్పీ(Assembly)లో మాట్లాడుతూ...రంగారెడ్డి జిల్లా(Rangareddy district)లో వేల ఎకరాలను కేసీఆర్, అండ్ బ్యాచ్ అమ్ముకున్నారని మండిపడ్డారు. ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్(IAS officer Amoy Kumar) కలెక్టర్ కాదని, కలెక్షన్ కింగ్(collection king) అని ఎద్దేవా చేశారు. పేద ప్రజలను నట్టేటా ముంచాడన్నారు. కేటీఆర్(KTRBRS) అండ దండలతో రెచ్చిపోయాడన్నారు. తెలంగాణ ఆస్తిని ధ్వంసం చేసిన దుర్మార్గులు బీఆర్ఎస్ నాయకులని విమర్శించారు. చిల్లర మాటల్లో బీఆర్ఎస్ బ్రాండ్ అంబాసిడర్ అని విమర్శించారు. ప్రజల గొస తీర్చేందుకే మూసీ పునరుజ్జీవన కార్యక్రమం తీసుకున్నామన్నారు.
బర్త్ డే ఉన్నప్పటికీ, ప్రజల కోసం సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర చేశారన్నారు. సీఎం పాదయాత్ర లో స్వచ్ఛందంగా వేలాది మంది ప్రజలు పాల్గొన్నారని, కానీ బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. పాదయాత్ర ను చూసి ఓర్వలేక కేటీఆర్, హరీష్ రావు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారన్నారు. తాము తిట్లు మొదలు పెడితే, బీఆర్ఎస్ తట్టుకోలేదన్నారు. మూసీ పక్కన ఉన్న స్థలాలను బీఆర్ఎస్ ఆక్రమించుకున్నదన్నారు. వాటిని కాపాడుకునేందుకే ఇప్పుడు కపట ప్రేమ చూపుతున్నారన్నారు. పదేళ్లు మూసీకేసీఆర్ ఎందుకు మాట్లాడలేదు? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో మూసీ డెవలప్ మెంట్ పేరిట దోచుకున్నారన్నారు. మూసీ నీళ్లు తాపిస్తే కానీ హరీష్, కేటీఆర్ లకు బుద్ధి రాదని గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని విమర్శిస్తే పురుగులు పడి పోతారని శాపనార్ధాలు పెట్టారు.