ఎన్నికలు ముగిసేవరకు మంత్రి పొన్నం ప్రసంగాలు, ఇంటర్వ్యూలు ఆపాలి.. ఎన్నికల అధికారికి ఫిర్యాదు

by Ramesh N |
ఎన్నికలు ముగిసేవరకు మంత్రి పొన్నం ప్రసంగాలు, ఇంటర్వ్యూలు ఆపాలి.. ఎన్నికల అధికారికి ఫిర్యాదు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎన్నికల నియమావళికి విరుద్దంగా వ్యవహరిస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్‌పై చర్యలు తీసుకోవాలని బీజేపీ నేత కొట్టె మురళీకృష్ణ కరీంనగర్ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల అధికారికి లేఖ పంపారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, ప్రచార సభలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌పై నిరాధార అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో తెలిపారు. వెధవ, సమాధి చేస్తామంటూ వ్యక్తిగత దూషణలతో అవమానకర పదజాలంతో పొన్నం ప్రసంగాలు చేస్తున్నారని ఆరోపించారు.

హిందువుల మనోభావాలను కూడా దెబ్బతీసేలా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. బండి సంజయ్‌పై కార్పొరేటర్‌గా ఉన్న సమయంలో సానిటేషన్ కార్మికుల వద్ద డబ్బులు తీసుకున్నారంటూ నిరాధారమైన కల్పిత ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. కరీంనగర్ జిల్లా నియోజకవర్గ ప్రజలను గందరగోళపరచి అయోమయానికి గురి చేసేలా ప్రభావితం చేస్తున్నారని ఎన్నికల అనుబంధాలకు విరుద్దంగా వ్యక్తిగత ఆలోచన రాష్ట్ర మంత్రి ఉన్న ప్రభాకర్ పై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఎన్నికల నియమావళి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న పొన్నం ప్రభాకర్ పై ఎన్నికలు ముగిసే వరకు ప్రసంగాలు ఇంటర్వ్యూలు ఇవ్వకుండా నిలుపుదల చేయాలని కోరారు.

Advertisement

Next Story