భరించలేకే కాంగ్రెస్ పై వ్యాఖ్యలు.. కేటీఆర్ కు మహేశ్ కుమార్ గౌడ్​ కౌంటర్

by Ramesh Goud |
భరించలేకే కాంగ్రెస్ పై వ్యాఖ్యలు.. కేటీఆర్ కు మహేశ్ కుమార్ గౌడ్​ కౌంటర్
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ‌లో కుల‌గ‌ణ‌న స‌ర్వే పాద‌ర్శకంగా జ‌రిగిందని టీపీసీసీ ఛీప్ మహేశ్​కుమార్​ గౌడ్​ స్పష్టం చేశారు. ​కేటీఆర్ ఎలాంటి ఆధారాలు లేకుండా బీసీ కుల గణనను తప్పులు తడక అంటున్నాడని తప్పుబట్టారు. ఎంతో శాస్త్రీయంగా లక్షకు పైన సిబ్బందిని పెట్టి ఇల్లిల్లు పరిశీలన చేసి గణన చేయడం జరిగిందని తెలిపారు. కుల గణన దేశానికే ఆదర్శంగా చేపట్టామని, కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంటే భరించలేక కేటీఆర్​ఏదేదో మాట్లాడుతున్నారన్నారు. ఆదివారం కుల గణన స‌ర్వేపై కేటీఆర్ చేసిన కామెంట్స్​కు పీసీసీ ఛీప్​మహేశ్​కుమార్​ గౌడ్ ​కౌంటర్ ​ఇచ్చారు. కుల‌గ‌ణ‌న స‌ర్వేపై కేటీఆర్ వ్యాఖ్యలను బీసీ స‌మాజం క్షమించ‌దన్నారు. 1931 తర్వాత కుల గణన జరిగిందని, దీనిద్వారా బీసీలకు ఎంతో మేలు జరుగునుందన్నారు. దేశంలోనే మొదటిసారిగా పకడ్బందీగా కుల గణనను చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు.

2014 లో సమగ్ర కుటుంబ సర్వే చేసి కనీసం ఆ లెక్కలను కూడా బయటకు చెప్పలేని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు మాట్లాడడం అవివేకమన్నారు. బీసీలకు న్యాయం జరుగుతుంటే కేటీఆర్ భరించలేక పోతున్నారని, కుల‌ గ‌ణ‌న స‌ర్వేలో పాల్గొన‌ని కేటీఆర్, ఆయన కుటుంబ సభ్యులు రీ స‌ర్వే గురించి మాట్లాడ‌టం విడ్డూరంగా ఉందన్నారు. బల‌హీన‌వ‌ర్గాల గురించి కేటీఆర్ మాట్లాడ‌టం హ‌స్యాస్పదంగా ఉందన్నారు. ప‌దేళ్ల బీఆర్ఎస్ పాల‌న‌లో బీసీల‌కు తీర‌ని అన్యాయం జ‌రిగిందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్‌, బీజేపీ లోపాయికారి ఒప్పందం చేసుకున్నదని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో పోటిచేయడానికి బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు క‌రువయ్యారని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ ఎన్నిక‌ల్లో మాదిరిగానే ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ప‌రోక్షంగా బీజేపీకి బీఆర్ఎస్‌ మద్దతు ఇస్తోందని పీసీసీ ఛీప్​ఈ సందర్భంగా దుయ్యబట్టారు.

👉 Download our Android App
👉Download our IOS App
👉Follow us on Instagram
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed