- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఆ రెండు పార్టీల బంధంపై సీఎం ఓపెన్ స్టేట్‌మెంట్.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

దిశ, వెబ్ డెస్క్: అసెంబ్లీ సాక్షిగా బీజేపీ (BJP), కాంగ్రెస్ (Congress) ల బంధం బట్టబయలైందని, ఏకంగా ముఖ్యమంత్రే ఓపెన్ స్టేట్ మెంట్ ఇచ్చారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ (BRS MLA KP Vivekananda Goud) అన్నారు. తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly Sessions) కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మాణాన్ని ప్రవేశ పెట్టారు. అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ లో వివేకానంద మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఢిల్లీలో మకాం పెట్టాడని, ఢిల్లీ చుట్టు పక్కల వ్యాపారాలు మొదలు పెట్టాడని, అందుకే అసెంబ్లీ వేదికగా ఢిల్లీ మూడు వందల సార్లు పోతా అని అంటున్నాడని ఆరోపించారు.
రేవంత్ ఇప్పటికీ ఢిల్లీ 40 సార్లు వెళ్లి, కేంద్రమంత్రులు, ప్రధాని చుట్టూ తిరిగారని, కానీ రూపాయి తీసుకొని రాలేదని అన్నారు. ఢిల్లీలో ప్రధానిని ఎదుర్కోలేక కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Union Minister Kishan Reddy) తెలంగాణకు నిధులు రాకుండా అడ్డుకుంటున్నారని చేతకాని మాటలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. అంతేగాక తెలంగాణలో మోడీని పెద్దన్న అని పొగిడి.. రూపాయి తేలేదని, దీని గురించి అసెంబ్లీలో అడిగితే సమాధానం చెప్పలేక పోయారని అన్నారు. ఇవాళ అసెంబ్లీలో బీజేపీ, కాంగ్రెస్ ల అనుబంధం బయటపడిందని, బీజేపీ ఎమ్మెల్యే (BJP MLA).. మా పార్టీ ఎమ్మెల్యేలు సీఎంను రహస్యంగా కలుస్తున్నారని బహిరంగంగా చెబితే.. సభలో సీఎం మా నాయకుడే బీజేపీ ఫ్లోర్ లీడర్ (BJP Floor Leader) గా పని చేస్తారని ఓపెన్ స్టేట్ మెంట్ ఇచ్చారని తెలిపారు.
ఢిల్లీలో కుస్తీ, గల్లీలో దోస్తీ అని మరోసారి బయటపడిందని, దీనిని ప్రజలు గమణిస్తున్నారని అన్నారు. ఇక సభలో రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగంలో పస లేదు, ఒక ముఖ్యమంత్రి స్థాయికి దిగజారి మాట్లాడుతున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే ప్రభుత్వ పనితీరు, చేయాల్సిన పనులను చెప్పకుండా, ప్రతిపక్షాలపై నిందలు వేస్తూ.. ముఖ్యమంత్రి అయ్యాక కూడా ఇంకా పీసీసీ అధ్యక్షుడిగానే రేవంత్ మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. ఇలాంటి భాష మాట్లాడే ముఖ్యమంత్రిని ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా చూసి ఉండరని బీఆర్ఎస్ నేత ఆగ్రహం వ్యక్తం చేశారు.