Hyderabad rains: వర్షాకాలంలో విద్యుత్ తో జాగ్రత్త సీఎండీ జి.రఘుమా రెడ్డి

by Javid Pasha |   ( Updated:2023-07-20 15:59:45.0  )
Hyderabad rains: వర్షాకాలంలో విద్యుత్ తో జాగ్రత్త  సీఎండీ జి.రఘుమా రెడ్డి
X

దిశ , తెలంగాణ బ్యూరో : ప్రస్తుతం కురుస్తున్న వర్షాల నేపథ్యంలో కరెంట్ తో జాగ్రత్తగా వ్యవహరించాలని సీఎండీ జి.రఘుమా రెడ్డి అధికారులకు సూచించారు. ఎడతెరిపి లేకుండా వర్షాలతో విద్యుత్ సరఫరా పరిస్థితిపై టి ఎస్ ఎస్ పి డి సి ఎల్ , సి ఎం డి జి రఘుమా రెడ్డి చీఫ్ జనరల్ మేనేజర్, సుపెరింటెండింగ్ ఇంజినీర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భముగా సీఎండీ రఘుమా రెడ్డి మాట్లాడుతూ.. వాన కాలం సీజన్ ముగిసే వరకు ప్రతి జిల్లా, సర్కిల్ కార్యాలయాల్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.

వాతావరణంలో జరిగే మార్పులను నిరంతరం గమనిస్తూ ఎప్పటికప్పుడు క్షేత్ర సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తూ, తగు సిబ్బంది నిత్యం అందుబాటులో ఉండేలా చూసుకోవాలని సూపెరింటెండింగ్ ఇంజినీర్లకు, చీఫ్ జనరల్ మేనేజర్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు. విద్యుత్ కి సంబంధించి ఎలాంటి అత్యవసర పరిస్థితి ఉంటే 1912 / 100 / స్థానిక ఫ్యూజ్ ఆఫ్ కాల్ ఆఫీస్ తో పాటు విద్యుత్ శాఖ ప్రత్యేక కంట్రోల్ రూమ్ 7382071574, 7382072106, 7382072104 నకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు. వీటితో పాటు మొబైల్ ఆప్, వెబ్సైట్, ట్విట్టర్, ఫేస్ బుక్ ద్వారా కూడా విద్యుత్ సంబంధిత సమస్యలు తమ దృష్టికి తేవచ్చని సి ఎం డి తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed