- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కేసీఆర్‌కు సీఎం రేవంత్ పరామర్శ.. ఫొటోస్ విడుదల

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రమాదవశాత్తు కింద పడిపోయి తుంటి ఎముకకు దెబ్బ తగిలి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ సీఎం కేసీఆర్ తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. వైద్యులు మరింత మెరుగైన చికిత్స అందించి త్వరగా కోలుకునేలా అన్ని చర్యలూ తీసుకోవాల్సిందిగా సూచించానని మీడియాకు రేవంత్ వివరించారు. ప్రభుత్వం తరఫున అన్ని రకాల సహాయ సహకారాలు వైద్యబృందానికి ఉంటాయని స్పష్టం చేసినట్లు తెలిపారు. తోటి మంత్రులు సీతక్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులతో కలిసి సోమాజీగూడలోని యశోద ఆస్పత్రికి వెళ్ళి కేసీఆర్‌ను పరామర్శించారు. దీనికి సంబంధించిన ఫొటోలను బీఆర్ఎస్ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా విడుదల చేశారు.
Next Story