‘ఆయన వెనుక నేనుంటా’.. గాంధీ-కౌశిక్ రెడ్డి వివాదంపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |   ( Updated:2024-09-15 14:09:10.0  )
‘ఆయన వెనుక నేనుంటా’.. గాంధీ-కౌశిక్ రెడ్డి వివాదంపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, పాడి కౌశిక్ రెడ్డిల వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. తమ కార్యకర్తలు ఎవరి జోలికి వెళ్లబోరని తెలిపారు. కానీ, ఎవరైనా తమ జోలికి వస్తే మాత్రం వదిలిపెట్టరు అని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ‘కాంగ్రెస్(Congress) కార్యకర్తలకు నేను అండగా ఉంటా. మహేశ్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) సౌమ్యుడు.. ఏం కాదు అనుకుంటున్నారేమో. ఆయన వెనుక నేనుంటా’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘అసలు రా చూసుకుందాం’ అని ముందు కౌశిక్ రెడ్డి ఎందుకు అనాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ప్రజలు విశ్వసించి కాంగ్రెస్‌కు అధికారం ఇచ్చారని అన్నారు. తాము రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తామని మాట్లాడిన వారు ఇప్పుడు ఎక్కడ దాక్కున్నారని అడిగారు.

రాజీనామా చేస్తే సిద్దిపేటకు పట్టిన పీడ విరగడయ్యేదని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే హామీలను అమలు చేశామని అన్నారు. 30 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు.. 35 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చినట్లు తెలిపారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు మనకు సెమీ ఫైనల్ లాంటివని.. 2029లో ఫైనల్స్ జరుగబోతున్నాయని అన్నారు. రాహుల్ గాంధీని ప్రధాన మంత్రి చేసినప్పుడే ఫైనల్స్ గెలిచినట్లు అని వెల్లడించారు. అంతకుముందు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed