అభ్యర్థులు నిరుత్సాహపడొద్దు! గ్రూప్ 1 ఫలితాలపై సీఎం రేవంత్ ఆసక్తికర ట్వీట్

by Ramesh N |   ( Updated:2024-07-07 09:52:32.0  )
అభ్యర్థులు నిరుత్సాహపడొద్దు! గ్రూప్ 1 ఫలితాలపై సీఎం రేవంత్ ఆసక్తికర ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: గ్రూప్-1 ప్రిలిమ్స్ 2024 ఫలితాలను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాజాగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు. ‘గ్రూప్ - 1 మెయిన్స్ కు అర్హత సాధించిన 31,382 మంది అభ్యర్థులకు నా శుభాకాంక్షలు. అక్టోబర్ 21 - 27 మధ్య జరిగే మెయిన్స్ పరీక్షలో మీరు విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నాను. ప్రాథమిక పరీక్షలో విజయం సాధించలేకపోయిన అభ్యర్థులు నిరుత్సాహపడవద్దు. జీవితంలో లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం.. దాని కోసం ప్రయత్నించడం.. విజయం సాధించే వరకు ప్రయత్నాన్ని విరమించకపోవడం ఒక వ్యాపకంగా పెట్టుకున్న వారు ఎప్పటికైనా విజయతీరాలను చేరుతారు’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

కాగా, రాష్ట్రంలో 563 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రిలిమినరీ పరీక్షను జూన్‌ 9న టీజీపీఎస్సీ నిర్వహించింది. ప్రిలిమ్స్ ఫలితాలు తాజాగా విడుదల కావడంతో.. అక్టోబర్‌ 21 నుంచి 27 వరకు మెయిన్స్‌ పరీక్షలను నిర్వహించనున్నారు. 1: 50 నిష్పత్తిలో మెయిన్స్‌కు అభ్యర్థులను టీజీపీఎస్సీ సెలక్ట్ చేసినట్లు తెలిపింది. ఇక, గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష కోసం 1: 50 కు బదులుగా 1: 100 నిష్పత్తి ప్రకారం ఎంపిక చేయాలని విద్యార్థి సంఘాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed