గులాబీ ఫ్యామిలీ పాలిటిక్స్.. హరీశ్‌రావు స్థానంలోకి కవిత? : సామ రామ్మోహన్ రెడ్డి

by Ramesh N |
గులాబీ ఫ్యామిలీ పాలిటిక్స్.. హరీశ్‌రావు స్థానంలోకి కవిత? : సామ రామ్మోహన్ రెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్‌ (BRS) పార్టీలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయని టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి (Sama Ram Mohan Reddy) పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన గురువారం ఎక్స్ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘బీఆర్ఎస్ లో మారుతున్న రాజకీయ పరిణామాలు, మాజీ మంత్రి (Harish Rao) హరీశ్‌రావు స్థానంలో ఎమ్మెల్సీ కవిత (Kavitha Kalvakuntla)? నేడు వరంగల్ సభ ఏర్పాట్లలో కవిత ఫుల్ యాక్టివ్. హరీశ్‌ రావును దూరం పెడుతున్న గులాబీ బాస్? నేడు సభకి.. భవిష్యత్తులో బీఆర్ఎస్‌కి.. ఇక హరీష్ దూరమేనా? అనూహ్య మలుపులు తిరుగుతున్న గులాబీ ఫ్యామిలీ పాలిటిక్స్’ అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు. హరీశ్‌రావు, కవిత ఫోటోలను షేర్ చేశారు.

ఈ అభిప్రాయాన్ని బీఆర్ఎస్ శ్రేణులు ఖండించాయి. సబ్జెక్ట్ లేక చిల్లర పోస్టులతో రాజకీయాలు చేస్తున్నావు.. అని ఈ ట్వీట్‌పై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర విమర్శలు చేశాయి. మీరు ప్రజల గురించి ఆందోళన చెందాలి.. ఒక నెల నుంచే మాజీ మంత్రి హరీశ్‌రావు వరంగల్ సమావేశ స్థలాన్ని 3 సార్లకు పైగా సందర్శించారని, పార్టీ ఇన్ చార్జ్‌గా ఉంచిందని బీఆర్ఎస్ శ్రేణులు ట్వీట్‌కు కౌంటర్ ఇస్తున్నారు.



Next Story

Most Viewed