- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఎందుకొచ్చింది?.. అసెంబ్లీ సాక్షిగా బట్టబయలు చేయనున్న సీఎం..!
దిశ, తెలంగాణ బ్యూరో: గత ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని, ఆర్థిక దుబారాను, ప్రజాధనం దుర్వినియోగాన్ని ఎత్తి చూపేందుకు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో అన్ని శాఖలు, కార్పొరేషన్ల వారీగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్టు సమాచారం. ఈ నెల 14 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో తొలి మూడు రోజుల షెడ్యూలు తర్వాత ఇందుకు ప్లాన్ చేసినట్టు తెలిసింది. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఆర్థిక వ్యవస్థ కుదేలైన తీరు, చివరకు ప్రభుత్వ ఉద్యోగులకు సైతం సకాలంలో జీతాలు చెల్లించలేని దుస్థితి ఎందుకు తలెత్తిందో ఈ ప్రజెంటేషన్ ద్వారా వివరించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు.
కేసీఆర్ పాలనలో భారీ స్థాయిలో అవినీతి జరిగిందంటూ గతంలో కాంగ్రెస్, బీజేపీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాయి. తాజాగా ఆయా శాఖల అధికారుల నుంచి తీసుకున్న గణాంకాలను సభ్యులతో పాటు ప్రజలందరికీ వీటిని వివరించేందుకు సర్కారు సిద్ధమైనట్టు టాక్. ఏయే శాఖలో ఏ రూపంలో ప్రజాధనం దుర్వినియోగమైందో లెక్కలతో సహా వివరించి అసెంబ్లీ రికార్డుల్లోకి ఎక్కేలా చూడాలని భావిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వ గ్యారెంటీతో వివిధ కార్పొరేషన్ల పేరుతో తీసుకున్న రుణాలు నిర్దిష్టంగా ఆ అవసరాలకు వినియోగించకుండా డైవర్ట్ చేయడం, అప్పులు తీర్చడానికి పడుతున్న తిప్పలు ఇలాంటి వివరాలన్నింటినీ ఆ ప్రజెంటేషన్‌లో ప్రభుత్వం పొందుపర్చాలని భావిస్తున్నది.
జీతాలు ఇవ్వలేని దుస్థితి..?
తెలంగాణ ఏర్పడేనాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎలా ఉన్నది? బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ఎలా మారింది? ఎంత అప్పు పెరిగిందనే విషయాలను సర్కారు వివరించాలనుకుంటున్నది. ఒక్కో స్కీమ్‌కు అవుతున్న ఖర్చును తేటతెల్లం చేస్తూ పదేండ్లలో వాటికవసరమయ్యే వనరుల సమీకరణ కోసం చేసిన అప్పులు, మొత్తం ఆర్థిక వ్యవస్థనే దివాలా తీయించిన విధానాన్ని వివరించాలని ప్లాన్ చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఏయే రూపాల్లో ఎక్కడి నుంచి ఎంత అప్పు తీసుకున్నది.. వాటికి ప్రతి నెలా చెల్లిస్తున్న వడ్డీ, ‘అసలు’ రీపేమెంట్, కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న రుణాలు, వాటి ద్వారా అవి కూడా నష్టాల్లోకి, అప్పుల్లోకి కూరుకుపోవడం.. ఇలాంటి అనేక అంశాలను బహిర్గతం చేయాలనుకుంటున్నది.
ఏటా ఎక్కడి నుంచి అప్పు తీసుకున్నది? ఏ అవసరాలకు దానిని ఖర్చు పెట్టింది.. దాని ద్వారా ఎలాంటి ఫలాలు అందుతున్నాయి? వాటిని తీర్చడానికి ఉన్న మార్గమేంటి..? ఆర్థిక దుబారా ఎక్కడెక్కడ జరిగింది? ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి ఎందుకు తలెత్తింది? ప్రజలపై తలసరి అప్పు భారం ఏ మేరకున్నది? చివరకు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎలాంటి సంక్షోభంలోకి కూరుకుపోయింది అనే విషయాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో స్వయంగా ముఖ్యమంత్రే వివరిస్తారని సచివాలయ వర్గాల సమాచారం. ఇంకోవైపు ప్రభుత్వరంగ సంస్థలు (కార్పొరేషన్లు) ఏ అవసరం కోసం ఎంత అప్పు తీసుకున్నాయి? అవి ఎటువైపు డైవర్ట్ అయ్యాయి? వాటిని ఏ తీరులో వినియోగించింది? ఎప్పటికల్లా వాటిని తీర్చాల్సి ఉంటుంది? అనే విషయాలను సీఎం ప్రస్తావించనున్నారు.
విద్యుత్ రంగ లెక్కలు సైతం బయటకు..?
ఇంతకాలం సీక్రెట్‌గా ఉంచిన జెన్కో-ట్రాన్స్ కో సంస్థలతో పాటు ఉత్తర, దక్షిణ డిస్కంలకు ఉన్న అప్పులు, నష్టాలు తదితరాలన్నింటినీ బహిర్గతం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. పదేండ్లలో ఎంత లోటు నుంచి ఎక్కడిదాకా చేరుకున్నదనే అంశాలను స్పష్టం చేయాలని ప్లాన్ చేస్తున్నది. స్కీములు, ప్రాజెక్టులు, డిపార్టుమెంట్లు, కార్పొరేషన్లవారీగా అప్పులను, ఆర్థిక భారాన్ని వివరించాలన్నది ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉద్దేశం. ప్లానింగ్ లేకుండా నడిచిన ఆర్థిక వ్యవస్థ కారణంగా ఉద్యోగులకు, కాంట్రాక్టు స్టాఫ్‌కు ప్రతి నెలా చెల్లించాల్సిన జీతాలకు తిప్పలు ఎదురవడం, అలవెన్సుల చెల్లింపులు పెండింగ్‌లో పెట్టడం, మెడికల్ రీయింబర్స్మెంట్ చాన్స్ ఇవ్వకపోవడం.. వీటన్నింటినీ అసెంబ్లీ వేదికగానే ఏకరువు పెట్టాలనుకుంటున్నది.
ఇలాంటి ఆర్థిక దుస్థితి కారణంగా రానున్న కాలంలో ఎదురయ్యే సవాళ్లతో పాటు పూర్తిస్థాయిలో సంస్కరించడానికి తగినంత టైమ్ పడుతుందనేది విషయాన్ని ప్రజలకు అర్థం చేయించడం ఈ కసరత్తు ఉద్దేశంగా కనిపిస్తున్నది. అన్ని డిపార్టుమెంట్ల నుంచి వివరాలు అందిన తర్వాత వైట్ పేపర్ రూపంలో స్పష్టమైన నివేదికను, ప్రజెంటేషన్‌ను తయారుచేయడంపై కసరత్తు జరుగుతున్నది. గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్ మొదలు పొలాలకు సాగునీటిని అందించడం వరకు నీటిపారుదల వ్యవస్థపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌ను అసెంబ్లీలో ప్రదర్శించింది. ప్రస్తుత ప్రభుత్వం సైతం గత సర్కారు చేసిన అప్పులు, ఆర్థికభారంపై ప్రజలకు తెలిపేందుకు అదే బాటను ఎంచుకున్నది.