- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లండన్ వేదికగా కేసీఆర్‌పై CM రేవంత్ ఫైర్.. బీఆర్ఎస్ రియాక్షన్ ఇదే!
దిశ, వెబ్‌డెస్క్: లండన్ వేదికగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఖండించారు. శనివారం దానం మీడియాతో మాట్లాడుతూ.. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని అన్నారు. అధికారం ఉన్నా.. లేకున్నా తాము ఒకేలా ఉన్నామని చెప్పారు. తెలంగాణ అధివృద్ధికి పెట్టుబడులు ఆకర్షించాలి.. కానీ, రాష్ట్ర పరువును బజారుకీడిస్తే ఎలా అని ప్రశ్నించారు. అధికారం ఉందని అలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రజలను తమను వద్దనుకోలేదని.. కాంగ్రెస్‌కు ఒక అవకాశం ఇచ్చారు అంతే అని అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు ఏంటో ప్రజలకు తెలిసిపోయిందని అన్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరి సత్తా ఏంటో.. ఎవరెన్ని గెలుస్తారో చూద్దామని సవాల్ చేశారు. అనంతరం రేవంత్ వ్యాఖ్యలకు మరో బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి దావోస్ వేదికగా తెలంగాణ పరువు తీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి పాండిత్యాన్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. కేసీఆర్‌ను రేవంత్ రెడ్డి గురువు చంద్రాబాబే ఏం చేయలేకపోయారని గుర్తుచేశారు. కేసీఆర్‌తో పెట్టుకుంటే టీడీపీ నామరూపాల్లేకుండా పోయిందని తెలిపారు. పెట్టుబడులు తేవాలి కానీ.. పరాయి దేశంలో ఉండి వెకిలిగా మాట్లాడొద్దు అని హితవు పలికారు.
Read More: తెలంగాణ ప్రజలకు KTR సంచలన పిలుపు