వారికి పదవులు ఖాయం.. నామినేటెడ్ పోస్టుల భర్తీ CM రేవంత్ కీలక ప్రకటన

by Gantepaka Srikanth |
వారికి పదవులు ఖాయం.. నామినేటెడ్ పోస్టుల భర్తీ CM రేవంత్ కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ కేడర్‌(Congress Cadre)కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. శుక్రవారం గాంధీ భవన్‌లో కాంగ్రెస్ ముఖ్య నేతల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. మంచి మైకులో చెప్పాలి.. చెడు చెవిలో చెప్పాలని అన్నారు. కానీ మంచి చెవిలో చెప్పి.. చెడును మైకుల్లో వాగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలను మీనాక్షి సమన్వయం చేశారని తెలిపారు. ప్రభుత్వ నిర్ణయాల్లో పీసీసీ కార్యవర్గ సభ్యులు క్రియాశీలకంగా ఉండాలని చెప్పారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కష్టపడి పనిచేసిన వారికి తప్పకుండా పార్టీలో గుర్తింపు ఉండటంతో పాటు పదవులు కూడా వరిస్తాయని కీలక వ్యాఖ్యలు చేశారు. నామినేటెడ్ పోస్టులు(Nominated Posts) కూడా అలాంటి వారికే ఇస్తామని అన్నారు.

సమర్థులైన కార్యకర్తలకు సముచిత స్థానం తప్పకుండా ఉంటుందని భరోసా ఇచ్చారు. గత అసెంబ్లీ ఎన్నిక(Assembly Election)ల్లో పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన వారిలో కొందరికి పదవులు రాలేదు. మరో విడతలో తప్పకుండా అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అంతకుముందు ఈ సమావేశంలతో పార్టీ బలోపేతం, ఏఐసీసీ ఇచ్చిన కార్యక్రమాల నిర్వహణ మీద చర్చ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలుపొందేలా అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్‌చార్జి మీనాక్షి పాల్గొన్నారు.

Next Story

Most Viewed