- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
అశ్లీల నృత్యాలకు కేరాఫ్ పబ్‌లు.. మగువ మైకం తో వల

దిశ, చైతన్య పురి : ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పబ్ లు ఏర్పాటు చేసి ధనార్జనే ధ్యేయంగా అసాంఘిక, అశ్లీల నృత్యాలను ప్రోత్సహిస్తూ పబ్ యజమానులు కాలం వెళ్లదీస్తున్నారు. పబ్ లోపల ఏం జరుగుతుందనేది ఫిర్యాదులు వస్తేనే పోలీసులు తనిఖీలు చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.
అసలు పరిస్థితి ఏమిటి..
సరూర్ నగర్ ఎక్సైజ్ శాఖ పరిధిలో అనుమతి పొందిన బార్లు 54 ఉన్నాయి. బార్లు ఏర్పాటు చేస్తామని లైసెన్స్ పొందిన యజమానులు కొందరు కొన్నింటిని పబ్ లుగా మార్చేస్తున్నారు. అంతేనా అంటే అది కాదు. వివిధ రాష్ట్రాల నుంచి నిరుపేద అమాయక యువతులను తీసుకొచ్చి సగం వరకు దుస్తులు ధరింపజేసి అశ్లీల నృత్యాలు చేయమని ప్రోత్సహిస్తున్నారు. పబ్ లకు వచ్చే జంటలు రుసుము చెల్లించకుండా లోపలికి వెళ్లడానికి అనుమతిస్తారు. ఒంటరిగా వెళ్లే యువకులకు మాత్రం వెయ్యి నుంచి రెండు వేలు తీసుకుని కూపన్ ఇస్తారు. కూపన్ పొందిన యువకులు లోపల ఒంటరిగా కూర్చుని కూపన్ పైన వచ్చే మద్యాన్ని సేవిస్తారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఇక్కడే అసలు విషయం మొదలవుతుంది.
ధనార్జనే ధ్యేయం..
ఒంటరిగా వెళ్లిన యువకులు మద్యం సేవిస్తూ కూర్చోవడంతో ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్న యజమానులు యువతుల మగువ మైకంతో వల విసురుతారు. సగం వరకు దుస్తులు ధరించిన యువతులు వారి వద్దకు వెళ్లి కవ్వింపు చర్యలకు పాల్పడుతూ మద్యం సేవిస్తూ అధిక బిల్లులు వచ్చేలా ప్రవర్తిస్తారు. కస్టమర్స్ కి కంపెనీ ఇస్తూ బిల్లులు పెరిగేలా ప్రోత్సహిస్తారు. తద్వారా జేబు గుల్ల చేసుకోవడం ఒంటరిగా వెళ్లిన యువకుల వంతు అవుతుంది.
సమయపాలన ఏది..
పబ్ ల పేరిట ఏర్పాటు చేసిన బార్లు రాత్రి 12 గంటల వరకు, వీకెండ్ లో మాత్రం రాత్రి 1 గంట వరకు నడిపించాలని నిబంధన ఉంది. కానీ అవేవి పట్టింపు లేకుండా తెల్లవారుజామున రెండు గంటల వరకు కూడా నడిపిస్తున్నట్లు చర్చ ఉంది. సమయపాలన నిబంధనలు పాటించకుండా పబ్ లు ఏర్పాటు చేసిన వారిపై సంబంధిత పోలీసు అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తుండడంతో వీరి వ్యాపారానికి అడ్డు అదుపు లేకుండా పోయింది. ఈ క్రమంలో సోమవారం రాత్రి ఎల్బీనగర్ ఎస్ఓటీ, చైతన్యపురి పోలీసులు గ్రీన్ హిల్స్ కాలనీలోని వైల్డ్ హర్ట్స్ పబ్ లో తనిఖీలు చేశారు. ఇందులో అశ్లీల నృత్యాలు చేస్తున్న 16 మంది యువతులను ఒక డిజే ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.