- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రేపు ఢిల్లీకి CM రేవంత్ రెడ్డి.. చర్చించే అంశాలివే..!
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రానికి కొత్త ఇన్‌చార్జిగా దీపాదాస్ మున్షీ నియమితులైన తర్వాత తొలిసారిగా కాంగ్రెస్ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం గాంధీభవన్‌లో ఈ పీసీసీ మీటింగ్‌లో ఏఐసీసీ ఇన్‌చార్జి కార్యదర్శులు, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సభ్యులు, ఎన్నికల కమిటీ సభ్యులు, మంత్రులు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, సీనియర్ ఉపాధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అన్ని అనుబంధ సంఘాల చైర్మన్లు పాల్గొననున్నారు.
మళ్లీ తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో అన్ని ఎంపీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా అసెంబ్లీ ఫలితాలకు మించి ఉండాలని వ్యూహాలు రచించబోతున్నారు. మరోవైపు నామినేటెడ్ పోస్టుల భర్తీపై ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకునే అవకాశం కన్పిస్తోంది. అయితే సంక్రాంతి లోపు పూర్తి చేస్తామని ఇదివరకే సీఎం వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ విస్తృత స్థాయి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఎన్నికల్లో పార్టీ గెలుపునకు పని చేసిన నేతలకే ప్రాధాన్యం ఇవ్వాలని చూస్తున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.
వచ్చే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రేపు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఏఐసీసీ సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. లోక్ సభ ఎన్నికలపై అధిష్టానం దిశానిర్దేశం చేయనున్నట్లు తెలిసింది. దీంతో పాటు మంత్రి మండలి విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీపై అధిష్టానంతో చర్చిస్తారని సమాచారం. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయా రాష్ట్రాల సీఎంలు, పీసీసీ చీఫ్‌లతో కాంగ్రెస్ హైకమాండ్ సమావేశం కానుండగా సీఎం రేవంత్ రెడ్డి గురువారం ఢిల్లీకి వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి.