YCP: లోకేష్‌ డిప్యూటీ సీఎం అంటే అమిత్ షా ఒప్పుకోలే.. మాజీమంత్రి అంబటి సంచలన వ్యాఖ్యలు

by Ramesh Goud |
YCP: లోకేష్‌ డిప్యూటీ సీఎం అంటే అమిత్ షా ఒప్పుకోలే.. మాజీమంత్రి అంబటి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: అందితే జుట్టు అందకపోతే కాళ్లు అనేది చంద్రబాబుకు తెలిసిన విద్య అని మాజీమంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు(YSRCP Leader Ambati Rambabu) వ్యాఖ్యానించారు. ఏపీలో కేంద్రమంత్రి అమిత్ షా(Union Minister Amit Sha) పర్యటనపై మీడియాతో మాట్లాడిన ఆయన.. కూటమి నేతలపై సంచలన ఆరోపణలు చేశారు. గతంలో అమిత్ షా తిరుమలకు వచ్చినప్పుడు చంద్రబాబు(Chandrababu Naidu) తన వర్గంతో రాళ్ల వర్షం కురిపించాడని, ఇప్పుడు ఘన స్వాగతం పలుకుతున్నారని, చంద్రబాబు అందితే జుట్టు, లేకపోతే కాళ్లు పట్టుకుంటాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే ఏపీలో ఎన్నో సమస్యలు పెండింగ్ లో ఉన్నాయని, తెలంగాణ నుంచి రావాల్సిన 8 వేల కోట్ల బకాయిలు, కృష్ణా జలాల సమస్యలు ఉన్నాయని, అమిత్ షా వీటి గురించి ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు.

ఇక విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు 11,440 కోట్ల ప్యాకేజీ ఏ లెక్కన ఇచ్చారో కార్మికులకు కూడా అర్థం కావడం లేదని తెలిపారు. అమిత్ షా జగన్ ప్యాలెస్ ల గురించి అడిగారని అంటున్నారని, అసలు అమిత్ షా ఉన్న చంద్రబాబు ఇళ్లు ఓ అక్రమ కట్టడం అని, దాని గురించి అమిత్ షాకు చెప్పాల్సింది కదా అని ఎద్దేవా చేశారు. అమిత్ షా చెప్పడం వల్లే గతంలో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ను ఉప ముఖ్యమంత్రిని(Deputy CM) చేశారని, ఇప్పుడు లోకేష్(Lokesh Nara) ను డిప్యూటీ సీఎం చేస్తామంటే అమిత్ షా ఒప్పుకోలేదని తమ వద్ద సమాచారం ఉందని తెలిపారు. చంద్రబాబు, జగన్ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాడని, పని చేసే ప్రతీసారి జగన్ తప్పిదం అని చెప్పడం సరికాదన్నారు. ప్రకృతి విపత్తులు జరిగితే ఎన్డీఆర్ఎఫ్, మానవ విపత్తులు జరిగితే ఎన్డీఏ వస్తుందని అమిత్ షా అంటున్నారని, మరి తిరుపతి ఎందుకు రాలేదని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం అసమర్థ పాలన చేస్తోందని, చంద్రబాబు ఏదేదో మాట్లాడుతూ అందరి బుర్ర పాడు చేస్తున్నారని అంబటి అన్నారు.

Next Story