Jaipal Reddy : కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డికి సీఎం రేవంత్ నివాళులు

by Ramesh N |
Jaipal Reddy : కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డికి సీఎం రేవంత్ నివాళులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర మాజీ మంత్రి, ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు గ్రహీత ఎస్. జైపాల్ రెడ్డి 5 వ వర్ధింతి సందర్భంగా నక్లెస్‌రోడ్ లోని స్పూర్తి స్థల్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. జైపాల్ రెడ్డి తన జీవితాన్ని తెలంగాణ కోసం త్యాగం చేశారని కొనియాడారు. రాష్ట్ర ఏర్పాటులో జైపాల్ రెడ్డి పాత్ర మరవలేనిదని పేర్కొన్నారు. ఆయన జీవితం స్ఫూర్తి దాయకమని, ఆయన ఆశయాలకు అనుగుణంగా తెలంగాణలో పాలన సాగిస్తామని చెప్పుకొచ్చారు.

ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వారితో పాటు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, జైపాల్ రెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Next Story