- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
CM Revanth Reddy: ఒక్కొక్కడి తోడ్కలు తీస్తా.. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్

దిశ, డైనమిక్ బ్యూరో: సోషల్ మీడియాలో (Social Media) హద్దు మీరుతున్న వారిని బట్టలూడదీసి రోడ్లమీద తిప్పిస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) హెచ్చరిచారు. జర్నలిస్టు రేవతి (RevanthI Arrest) అరెస్టు విషయంలో బీఆర్ఎస్ (BRS) వైఖరిపై సీఎం మండిపడ్డారు. ఇవాళ సభలో మాట్లాడిన ముఖ్యమంత్రి.. కొందరు పెయిడ్ ఆర్టిస్టులను తెచ్చి పార్టీ ఆఫీస్ లోనే పెట్టి వీడియోలు రికార్డు చేసి వాటిని సోషల్ మీడియాలో పోస్టు పెటితే వాటిపై పోలీసుల కేసు పెట్టి ఇద్దర్ని అరెస్టు చేశారు. దానికి బీఆర్ఎస్ నేతలకు దుఃఖం వస్తుంది. సోషల్ మీడియాలో వాళ్లు పెట్టిన భాష ఓ సారి వినండి. జర్నలిస్టుల ముసుగులో మమ్మల్నీ మా ఇంట్లోని మహిళలపై ఇష్టారీతిలో తిట్టిస్తున్నారని బీఆర్ఎస్ పై ఫైర్ అయ్యారు. ప్రజాజీవితంలో ఉన్నాం కాబట్టి ఓపిక పడుతున్నా. ఆ భాష వింటే రక్తం మరుగుతుంది. కుటుంబ సభ్యులను అంతేసి మాటలు అంటుంటే మీరసలు మనుషులేనా? మీకు భార్యా బిడ్డలు, తల్లిదండ్రులు లేరా? మీ అమ్మనో, మీ చెల్లినో, మీ భార్యనో ఈ రకంగా మాట్లాడితే మీరు వింటారా? అని ప్రశ్నించారు. నా భార్య, బిడ్డను తిటుతుంటే నాకు నొప్పి అవుతుంది. కానీ ఓ ఆడబిడ్డను అవమానిస్తుంటే మీకు నొప్పికాదా? ఏ సంస్కృతిలో ఉన్నారు. ముఖ్యమంత్రిగా చెబుతున్నా.. ఒక్కొక్కరి తోడ్కలు తీస్తా. రాజకీయ జీవితంలో ఉన్నది మేము మమ్మల్ని విమర్శించండి. మా పనితీరుపై విశ్లేషించాలన్నారు. ఆ రకమైన భాషను ఆడపిల్లలే రికార్డు చేయించి తమ ప్లాట్ ఫామ్ లపై పోస్టులు చేస్తే ఇది మంచి పద్దతా అని నిలదీశారు. ఇలాంటి వారు కోర్టులకు వెళ్లి బెయిల్ తెచ్చుకుంటామనుకుంటున్నారేమో అవసరం అయితే చట్టాన్ని సవరిస్తామన్నారు. వీటిని క్షమించే ప్రసక్తే లేదని, ఉక్కుపాతరేస్తామని హెచ్చరించారు.
ఎవరు జర్నలిస్టులు?:
జర్నలిస్టు అనే పదానికి అర్థం ఏంటో జర్నలిస్టు సంఘాలు (Journalist Unions) చెప్పాలని సీఎం అన్నారు. ఎవరు జర్నలిస్టులో లిస్టు ఇవ్వండి. ఆ జాబితాలో ఉన్నవారు ఇలా తప్పుచేస్తే ఏ శిక్ష విధిస్తారో మీరు నిర్ణయించండి. ఆ లిస్టులో లేని వారిని క్రిమినల్ కిందనే చూస్తామన్నారు. ఎలాంటి గుర్తింపు లేకుండా, యూ ట్యూబ్ ఛానెళ్లు పెట్టుకొని అసభ్య పదజాలంతో ఇష్టం ఉన్నట్లు మాట్లాడే వాళ్లు జర్నలిస్టులా? లేక ఐ అండ్ పీఆర్, డీఏవీపీ ఆమోదించిన పత్రికలు, ప్రసార సాధనాలు ఇచ్చే ఐడీ కార్టులు కలిగిన వారు జర్నలిస్టులా అని ప్రశ్నించారు. ఐ అండ్ పీఆర్ మంత్రి జర్నలిస్టు సంఘాలతో సమావేశం కావాలని సూచిస్తున్నాన్నారు. ఓపికతో మర్యాదతో ఉంటున్నారు. మీకెంతమంది ఉన్నారో తెలియదు. నాకు చికాకు వచ్చిందని తెలిస్తే లక్షలాది మంది మా పిల్లలు రోడ్లమీదకు వచ్చి ఒక్కొక్కడి బట్టలూడదీసి కొడతారు. చట్టాలపై సంపూర్ణమైన నమ్మకం, గౌరవం ఉంది కాబట్టి ఏమనకుండా ఊరుకుంటున్నాం. అది మా చేతగాని తనం అనుకోవచ్చని హెచ్చరించారు. కుర్చీలో ఉన్నానని అన్ని భరిస్తానని అనుకోవద్దు. చట్టపరిధిలోనే అందరి భరతం పడుతాను. ఎక్కడో దగ్గర దీనికి పరిష్కారం చూపించాల్సిన అవసంరం ఉంది. స్పీకర్ అనుమతితో ఒక రోజు దీనిపై చర్చ చేద్దామన్నారు.
కేసీఆర్ నీ పిల్లలకు చెప్పు:
ఈ పద్దతి మంచితి కాదని కేసీఆర్ (KCR) తన పిల్లలకు బుద్ధి చెప్పుకోవాలని రేవంత్ రెడ్డి అన్నారు. ఇంట్లోవారిని తిట్టించి మానసికింగా దెబ్బతీసి రాజకీయంగా ప్రయోజనం పొందవచ్చని నీవ్వేమైనా కలలు కంటున్నవేమో అది కుదరు కేసీఆర్ అన్నారు. హద్దుమీరి మాట్లాడితే దాని ఫలితం అనుభవిస్తారు. పదవి ఎంతకాలం ఉన్నామనేది కాదు ఎలా పదవిలో ఉన్నారనేది నేను లెక్కకడుతా. ఆత్మగౌరవం చంపుకుని పదవికోసం లాలూచిపడే రాజకీయం నేను చేయనున్నారు.
READ MORE ...
అగ్రరాజ్యంలో తెలుగు సంబరాలు.. CM రేవంత్‌కు ఆహ్వానం