అసలు మీరేం చేస్తున్నారు.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, విప్‌లపై CM రేవంత్ ఫైర్

by Gantepaka Srikanth |
అసలు మీరేం చేస్తున్నారు.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, విప్‌లపై CM రేవంత్ ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు(Congress MLAs), ప్రభుత్వ విప్‌లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో విపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు(BRS MLAs) ఆందోళనలు చేస్తుంటే మీరేం చేస్తున్నారని మండిపడ్డారు. సభలో వారు గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంటే.. మీరు కనీసం స్పందించడం లేదు.. నోరు మెదపడం లేదు.. ఇది సరైన పద్దతి కాదని అసహనం వ్యక్తం చేశారు. ఇకనైనా ప్రభుత్వ విప్‌(Government Whip)లు పనితీరు మార్చుకోవాలని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్(Congress) ఎమ్మెల్యేలు అందరూ అన్ని విషయాలు మాట్లాడాల్సిన అవసరం లేదు.. తప్పకుండా ఒక్కో ఎమ్మెల్యే.. ఒక్కో అంశంపై మాట్లాడాలని సూచించారు.

కాగా, అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యులు అందోళన చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వరి రైతులకు రూ.500 పంట బోనస్‌ ఇస్తున్నామని.. మహాలక్ష్మీ స్కీమ్‌ కింద మహిళలకు ఉచిత బస్సు, రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ ఇస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే రూ.25వేల కోట్ల రుణమాఫీ చేశామని చెప్పారు. ఇది తమ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని తెలిపారు. ఈ నేపథ్యంలో గవర్నర్ చేత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలు చెప్పిస్తోందని.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒకవైపు గవర్నర్ ప్రసంగిస్తుండగానే.. మరోవైపు బీఆర్ఎస్ సభ్యులు ఆందోళనలు చేస్తున్నారు.

Next Story