- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
CM Revanth Reddy : రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి

దిశ, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) సోమవారం ఢిల్లీ వెళ్లనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కులగణన సర్వే(Cast Census Survey) చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సర్వే ఆధారంగా ఎస్సీ వర్గీకరణ చేయడంతోపాటు.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కీలకంగా మారాయి. బీసీ రిజర్వేషన్ల బిల్లు(BC Reservations Bill)ను త్వరలో మొదలయ్యే బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీలో ప్రవేశపెట్టి.. ఆమోదముద్ర వేసేందుకు సర్కార్ నిర్ణయం తీసుకుంది. అనంతరం ఆ బిల్లుకు చట్టబద్ధత కల్పించేందుకు రేవంత్ ప్రభుత్వం పావులు కదుపుతోంది.
ఈ క్రమంలో మార్చ్ 10న ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాల్లో(Parliament Sessions) బిల్లుకు ఆమోదం తెలిపేలా ప్రధాని మోడీని(PM Modi), పలువురు కేంద్రమంత్రులను, ఇతర పార్టీల నేతలను సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలిసి ప్రత్యేక వినతి చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ బిల్లు లెక్క తెలితేనే దీని ఆధారంగా స్థానిక ఎన్నికలకు వెళ్ళేలా ప్లాన్ చేస్తోంది రేవంత్ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రిల ఢిల్లీ పర్యటన కీలకంగా మారింది.