పంటనష్టం నివేదికను తెప్పించండి.. సీఎస్‌కు సీఎం కేసీఆర్ ఆదేశం

by GSrikanth |
పంటనష్టం నివేదికను తెప్పించండి.. సీఎస్‌కు సీఎం కేసీఆర్ ఆదేశం
X

దిశ, తెలంగాణ బ్యూరో: కరీంనగర్ జిల్లా చొప్పదండి, కరీంనగర్ రూరల్ మండలంతో సహా రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో కురిసిన అకాల వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్న నేపథ్యంలో జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఆదివారం ఆదేశించారు. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి దెబ్బతిన్న పంటలకు సంబంధించిన వివరాలతో కూడిన నివేదికలు తెప్పించాలని సీఎం తెలిపారు.

Advertisement

Next Story